AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu Lockdown: కరోనా ఎఫెక్ట్.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ పొడిగింపు..

Tamil Nadu Lockdown: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Tamil Nadu Lockdown: కరోనా ఎఫెక్ట్.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ పొడిగింపు..
Lock Down
Shiva Prajapati
|

Updated on: Jul 30, 2021 | 10:45 PM

Share

Tamil Nadu Lockdown: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడగించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆగస్టు 9వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే లాక్‌డౌన్‌లో భాగంగా కొన్నింటిని పూర్తిగా మూసివేయగా, మరికొన్నింటికి సడలింపులు ఇచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. టాస్మాక్ బార్‌లు, హోటల్‌, క్లబ్‌లలోని బార్‌లు పూర్తిగా మూసివేస్తారు. అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలు, సినిమా హాళ్లు, బార్‌లు/పబ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, సాంస్కృతి, ప్రజా, విద్యాసంస్థలు, జూ పార్క్‌లు, రాజకీయ ప్రదర్శనలన్నింటిపై నిషేధం విధించారు.

కాగా, కిరాణా షాపులు, వాణిజ్య కార్యకలాపాలు రాత్రి 9 గంటల వరకు పని చేసేలా అనుమతించారు. అంతకుముందు రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. హోటళ్లు, టీ-స్టాల్స్, బేకరీలు, రోడ్‌సైడ్ షాపులు మొదలైనవి రాత్రి 9 గంటల వరకు 50 శాతం చొప్పున ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. కాగా, పుదుచ్చేరికి బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also read:

China: చైనా నక్కచిత్తులు..ఆర్మీలో ఇంటికి ఉద్యోగం పేరిట టిబెటన్లకు గాలం..

Viral Video: ఈ పక్షి మహా ముదురు బాబోయ్.. సైలెంట్‌గా వచ్చింది.. చిప్స్ ప్యాకెట్‌ను ఎత్తుకెళ్లింది.. ఫన్నీ వీడియో మీకోసం..

Sri Lanka Cricket Board : కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముగ్గురు క్రికెట్లర్లపై ఏడాది నిషేధం..