కరోనాతో చెన్నైలోని వండలూరు జూలో సింహం మృతి.. మరో తొమ్మిది సింహాలకు పాజిటివ్‌గా తేల్చిన రిపోర్ట్..!
కరోనా మహమ్మారి మనుషులనే కాదు.. జంతువులను సైతం వదలడం లేదు. తాజాగా కోవిడ్ కారణంగా చెన్సైలోని వండలూరు జూలో...
కరోనా మహమ్మారి మనుషులనే కాదు.. జంతువులను సైతం వదలడం లేదు. తాజాగా కోవిడ్ కారణంగా చెన్సైలోని వండలూరు జూలో ఓ మగ సింహం మృతి చెందింది. అంతకుముందే కరోనా లక్షణాలు కనిపించడంతో దాని నుంచి శాంపిల్ సేకరించి అధికారులు.. వాటిని టెస్ట్ కోసం పంపించారు. అది కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే రిపోర్ట్ తప్పుగా కూడా వచ్చే అవకాశం ఉందని, సింహం దీర్ఘకాల వ్యాధులతో చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. రెండో శాంపిల్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజ్‌స్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు.
గత వారం ఈ సింహం అనారోగ్యానికి గురైంది. దానిని చూసి కరోనా సోకినట్లు అనుమానించిన సిబ్బంది.. శాంపిల్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు. అక్కడే ఉన్న ఇతర సింహాల శాంపిళ్లు కూడా పాజిటివ్‌గా తేలినట్లు జూ సిబ్బంది వెల్లడించారు. జూలో ఉన్న 9 ఇతర సింహాలకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. అయితే వాటికి కరోనా ఎలా సోకిందన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గత నెలలో హైదరాబాద్ జూలో కూడా 8 సింహాలకు కరోనా వైరస్ సోకింది. దీంతో సింహాలకు ఏ విధంగా చికిత్స అందిస్తున్నారో హైదరాబాద్ జూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also Read:
ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..
దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?