Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Christmas celebrations in india: దేశ వ్యాప్తంగా క్రిస్‌మస్‌ పర్వదిన సంబరాలు అంరగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక

PM Narendra Modi: యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

| Edited By: Phani CH

Updated on: Dec 25, 2021 | 8:48 AM

Christmas celebrations in india: దేశ వ్యాప్తంగా క్రిస్‌మస్‌ పర్వదిన సంబరాలు అంరగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. క్రిస్టమస్ సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రిస్‌మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కరుణ, ప్రేమ, సేవ, దయ యేసుక్రిస్తు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. యేసు జీవితం, బోధనలను గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుసంపన్నంగా ఆయూరారోగ్యాలతో సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా క్రిస్మస్‌ సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్ చేశారు. భారతదేశం, విదేశాలలో ఉన్న పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భంగా న్యాయం, స్వేచ్ఛ విలువలపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించాలని సంకల్పిద్దాం. యేసుక్రీస్తు బోధలను మన జీవితంలో అనుసరిద్దాం అంటూ ట్విట్ చేశారు.

కాగా.. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం.. గోవా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రార్ధనలు జరిగాయి.

Also Read:

Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్ష విరమణలు ప్రారంభం.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

Night Curfew: ఒమిక్రాన్‌ టెన్షన్.. ఆ రాష్ట్రాల్లో నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ.. మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి..