Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్ష విరమణలు ప్రారంభం.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

Vijayawada Indrakeeladri: విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి.

Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్ష విరమణలు ప్రారంభం.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
Devotees
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 25, 2021 | 8:27 AM

Vijayawada Indrakeeladri: విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షా విరమణలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, 4 నుంచి 5 లక్షల మధ్య భవానీలు అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భవానీల రద్దీ దృష్ట్యా మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు అధికారులు. జల్లు స్నానాల కోసం 500 షవర్లు, ఇరుముడు లు సమర్పించేందుకు 50 స్టాండ్ల తో పాటు గురు భవానీలను సిద్ధం చేశారు దుర్గగుడి అధికారులు. కొండ చుట్టూ దాదాపు పది కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షణ కు అనుమతి ఇచ్చారు. మార్గం మధ్యలో భవానీలకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు.

Also read:

IPS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐపిఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. పూర్తి వివరాలివే..

Horoscope Today: ఈ రాశివారు ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

MiG-21 Crash: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. వింగ్ కమాండర్ మృతి