MiG-21 Crash: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. వింగ్ కమాండర్ మృతి

MiG-21 Fighter Jet Crash: భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం శుక్రవారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో ప్రమాదవశాత్తూ

MiG-21 Crash: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. వింగ్ కమాండర్ మృతి
Madar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 25, 2021 | 7:08 AM

MiG-21 Fighter Jet Crash: భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం శుక్రవారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా వీరమరణం పొందారు. ఈ మేరకు భారత వైమానిక దళం శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. బార్మర్‌లో శిక్షణ సమయంలో వైమానిక దళానికి చెందిన మిగ్ -21 బైసన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయినట్లు ట్విట్ ద్వారా వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది.

సామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెసర్ట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో విమానం కూలిపోయిందని జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వైమానిక దళానికి చెందిన విమానం ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా మిగ్-21 విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. ఈ సంవత్సరం ఐదు మిగ్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. అయితే ఇండో-పాక్‌ బార్డర్‌ వద్ద ఈ ప్రమాదం జరగడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

కాగా.. 1971 నుంచి ఏప్రిల్ 2012 వరకు 482 మిగ్ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు, ఎనిమిది మంది సైనిక సిబ్బంది, ఒక ఎయిర్‌క్రూ మరణించారు. ప్రభుత్వం మే 2012లో పార్లమెంటులో వెల్లడించింది. అప్పటినుంచి కూడా మరిన్ని ప్రమాదాలు జరిగాయి. ఈ సంవత్సరం ఐదు ప్రమాదాలు జరగగా.. ముగ్గురు మరణించారు.

Also Read:

Congress – Trs: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఏ విషయంలో అంటే..!

Telangana: వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.