IPS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐపిఎస్‌ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. పూర్తి వివరాలివే..
IPS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐపిఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చింది.
IPS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐపిఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్ ఏసీబీ డీజీగా బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు మరికొందరు కీలక అధికారులను కూడా బదిలీ చేసింది సర్కార్. ఏసీబీ డైరెక్టర్‌గా శిఖ గోయల్, ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్, వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, సైబరాబాద్ క్రైమ్ డీసీపీగా కల్మేశ్వర్, నల్గొండ ఎస్పీగా రమారాజేశ్వరిని నియమించింది. సిద్దిపేట కమిషనర్‌గా శ్వేత, మెదక్ ఎస్పీగా రోహిణి, సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి, నార్త్‌జోన్ డీసీపీగా చందనా దీప్తి, సీసీఎస్ డీసీపీగా గజరాంగ్ భూపాల్‌కు బాధ్యతలు అప్పగించింది.
ఇక హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ప్రకాష్‌రెడ్డి, మహబూబాబాద్ ఎస్పీగా శరత్‌చంద్ర, వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి, నిజామాబాద్ సీపీగా కేఆర్ నాగరాజు, ఆదిలాబాద్ ఎస్పీగా ఉదయ్‌కుమార్‌ను నియమించింది. ఆసిఫాబాద్ ఎస్పీగా సురేష్, నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్, నాగర్‌కర్నూల్ ఎస్పీగా మనోహర్, మాదాపూర్ డీసీపీగా శిల్పవల్లీ, బాలానగర్ డీసీపీగా గోనె సందీప్ బాధ్యతలు చేపట్టనున్నారు. శంషాబాద్ డీసీపీగా జగదీశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, భూపాలపల్లి ఎస్పీగా సురేందర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీగా వెంకటేశ్వర్లు, జనగామ డీసీపీగా సీతారాంను నియమించింది తెలంగాణ ప్రభుత్వం.
Also read:
Horoscope Today: ఈ రాశివారు ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
MiG-21 Crash: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్.. వింగ్ కమాండర్ మృతి
Amazon: ఇయర్ ఎండ్ సేల్‌ని ప్రకటించిన అమెజాన్.. OnePlus, Xiaomiతో సహా ఈ ఫోన్లపై భారీ తగ్గింపు..