Hyderabad: ఈ కంత్రీల ట్యాలెంట్ మామూలుగా లేదు.. ఏ కార్డు అయినా క్షణాల్లో రెడీ.. షాక్ అయిన పోలీసులు..
Fake Aadhaar Cards: ఆధార్.. దీని ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఒక్కరికి దీని అవసరం ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ గ్యాంగ్ నకిలీవి సృష్టించే పనిలో పడింది. ఆఖరికి
Fake Aadhaar Cards: ఆధార్.. దీని ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఒక్కరికి దీని అవసరం ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ గ్యాంగ్ నకిలీవి సృష్టించే పనిలో పడింది. ఆఖరికి కటకటలా పాలైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. యూనిక్ ఐడెంటీటి కోసం ఆధార్‌ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పలు పథకాలకు దీన్ని కంపల్సరీ చేసింది. పుట్టింది మొదలు మనిషి చనిపోయే వరకు దీని అవసరం ఉంటుంది. ఈ అవసరాన్ని ఆసరాగ చేసుకున్న ఓ గ్యాంగ్ నకిలీవి సృష్టించి డబ్బులు దండుకుంటోంది. హకీంపేట కేంద్రంగా నిర్వహిస్తున్న నకిలీ ఆధార్ గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. అస్సాంలోని ఓ ఆధార్ ఏజెన్సీ పేరుతో, హైదరాబాద్‌లో కార్డులు సృష్టించారు ఫేక్‌గాళ్లు. ముస్తఫా, సల్మాన్ అనే వ్యక్తులు ఫేక్ ఐడీలను కొనుగోలు చేసి ఈ దందా నడిపిస్తున్నారు. ఆధార్ కార్డు అవసరం ఉన్నవారి నుంచి రెండు, మూడు వేలు తీసుకొని ఆధార్ కార్డు ఇస్తున్నారు.
ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా కార్డు ఇస్తున్నారని తెలిసి చాలామంది వీరి వద్ద ఆధార్ తీసుకున్నారు. అయితే, అస్సాం ఐడీలు తెలంగాణలో ఉండటం ఏంటని అనుమానం వచ్చి ఆరా తీయగా, అసలు విషయం బయటపడింది. మొత్తం తొమ్మిది మంది ముఠాలో ఎనిమిది మందిని పట్టుకున్నారు పోలీసులు. అస్సాం నుంచి ఫేక్ ఐడిలను అమ్మిన పవన్ మాత్రం తప్పించుకున్నాడు. అతనికోసం గాలిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ యాదవ్ తెలిపారు. ఆధార్ తీసుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంటుందని, ఇలాంటి వారిని నమ్మొద్దని సూచించారు. ఎవరైనా ఈజీగా ఇస్తామంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
Telangana | Hyderabad Police arrested 8 members of a gang involved in forging birth certificates for enrolment & updation of Aadhaar cards. They misused Aadhaar’s process. Police seized 6 Aadhaar kits & forms attested by fake officers: Police Commissioner Anjani Kumar (24.12) pic.twitter.com/CuswPYHtFj
— ANI (@ANI) December 24, 2021
Also Read: