Corruption in Collectorate: కలెక్టర్ ఆఫీస్‌లో నోట్ల కట్టలు.. ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. పూర్తి వివరాలివే..!
Corruption in Collectorate: అది కలెక్టర్ ఆఫీస్. కానీ బ్యాంకులో లాగా దర్శనమిచ్చాయి నోట్ల కట్టలు. అంత డబ్బు చూసి అవాక్కయ్యారు అధికారులు.
Corruption in Collectorate: అది కలెక్టర్ ఆఫీస్. కానీ బ్యాంకులో లాగా దర్శనమిచ్చాయి నోట్ల కట్టలు. అంత డబ్బు చూసి అవాక్కయ్యారు అధికారులు. ఇంతకీ అంత డబ్బు ఎక్కడిదో తెలుసా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడులో మార్పులు మొదలయ్యాయని చాలా వార్తలు వచ్చాయి. ఆయన కూడా అలాగే పనిచేస్తున్నారని చెబుతున్నారు విశ్లేషకులు. కానీ పాలకులు మారితేనే ఏం లాభం.. పనిచేసే అధికారులు కూడా మారాలి కదా, అనే వాదన కొత్తగా వినిపిస్తోంది. దానికి అనేక కారణాలున్నాయి. ఇటీవలే తమిళనాడులోని ఓ మహిళా అధికారి ఇంట్లో కొట్ల రూపాయలు దొరికాయి. వామ్మో అవినీతి ఈ రేంజ్‌లో ఉందా అనుకున్నారంతా. తాజాగా అదే స్థాయిలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అయితే, ఏ అవినీతి అధికారి ఇంట్లోనో కాదండి, ఏకంగా కలెక్టర్ కార్యాలయంలోనే నోట్ల కట్టలు దర్శనమివ్వడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ ఇష్యూ సంచలనంగా మారింది.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నగదు కట్టలు కట్టలుగా బయటపడింది. ఇప్పటివరకు ఆఫీస్ మూడో అంతస్తులో 60 లక్షల నగదు పట్టుబడింది. ఒక్కో ఆఫీసర్‌కు సంబంధించిన బీరువాలో నోట్ల కట్టలను గుర్తించారు ఉన్నతాధికారులు. కలెక్టర్ ఆఫీస్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా నగదు బయటపడొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఐదుగురు ముఖ్య అధికారులను సస్పెండ్ చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే, ఇంత డబ్బు ఆ ఆఫీస్‌లో ఎక్కడిదనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. మామూలుగానే పలు పర్మిషన్లు ఇవ్వడానికి ఇక్కడి అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీసు నుంచి ప్రభుత్వ కాంట్రాక్టు కేటాయింపులపై భారీగా అవినీతి జరుగుతున్నట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఫోకస్ పెట్టిన స్టాలిన్ ప్రభుత్వం, అకస్మాత్తుగా సోదాలు జరిపింది. ఈ దాడుల్లో అవినీతి అధికారుల భాగోతం ఇలా బయటపడింది.
Also read:
Greenko: వరల్డ్‌లోనే టాప్-3 ర్యాంక్ సాధించిన గ్రీన్‌కో.. తొలి భారతీయ కంపెనీగా సరికొత్త రికార్డ్..
Hyderabad CP: పబ్బుల యాజమాన్యాలకు సీపీ అంజనీ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై అలా చేశారో..!