Greenko: వరల్డ్‌లోనే టాప్-3 ర్యాంక్ సాధించిన గ్రీన్‌కో.. తొలి భారతీయ కంపెనీగా సరికొత్త రికార్డ్..
Greenko: గ్రీన్‌కో చరిత్రలో మరో కీర్తికిరీటం చేరింది. రెన్యువబుల్ ఎనర్జీలో దేశశక్తిని యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది గ్రీన్‌కో. గ్లోబల్ గ్రీన్ యుటిలిటీస్..
Greenko: గ్రీన్‌కో చరిత్రలో మరో కీర్తికిరీటం చేరింది. రెన్యువబుల్ ఎనర్జీలో దేశశక్తిని యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది గ్రీన్‌కో. గ్లోబల్ గ్రీన్ యుటిలిటీస్ విభాగంలో వరల్డ్‌లోనే టాప్-3 పొజిషన్‌లో నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టాప్-10లో చోటుదక్కించుకున్న తొలి భారతీయ కంపెనీగా నవచరిత్రకు నాంది పలికింది.
హైదరాబాద్‌కు చెందిన పవర్ దిగ్గజం గ్రీన్‌కో సంస్థ.. అతి తక్కువటైమ్‌లోనే అంచలంచెలుగా ఎదిగి ఔరా అనిపిస్తోంది. రెన్యువబుల్ ఎనర్జీ ప్రొడక్షన్‌లో దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఉత్తమ కంపెనీగా గుర్తింపు సాధించింది. సోలార్, విండ్, హైడ్రో పవర్ జెనరేషన్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఏటా 20 బిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది గ్రీన్‌కో కంపెనీ. దేశ మొత్తం అవసరాల్లో 1.5 నుంచి 2 శాతం వాటా గ్రీన్‌కోదే కావడం విశేషం. ఇలా ఉత్తమ పనితీరుతో అత్యద్భుతంగా దూసుకెళ్తున్న గ్రీన్‌కో సంస్థ.. ఇప్పుడు మరో హిస్టరీ క్రియేట్ చేసింది.
2021 సంవత్సరానికి అమెరికాకు చెందిన ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌లోనే టాప్-3 పొజిషన్‌లో నిలించింది గ్రోన్‌కో. టాప్-100 గ్రీన్ యుటిలిటీస్ పేరుతో ఈ లిస్ట్ విడుదల చేశారు. తక్కువ స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసే విద్యుదుత్పత్తి సంస్థలకు ఈ ర్యాంకింగ్స్ కేటాయించారు. జీరో కార్బన్ విడుదలతో పవర్ జనరేషన్ చేస్తున్న కంపెనీగా గ్రీన్ కో ప్రత్యేక గుర్తింపు సాధించింది. గ్లోబల్ గ్రీన్ యుటిలిటీస్ విభాగంలో ప్రపంచంలోనే టాప్-3 ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు దేశానికి చెందిన దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి టాప్-10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ కంపెనీగా గ్రీన్‌కో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక గ్రీన్ యుటిలిటీస్ ర్యాంకింగ్స్‌లో NHPC- 25, NPCIL- 33, టాటా పవర్ – 78వ స్థానంలో నిలిచాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్టర్‌లో వెల్లడించారు. అటు ఈ ఘనత సాధించడంపై గ్రీన్‌కో యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. క్లీన్ ఎనర్జీ కోసం చేస్తున్న కృషికి దక్కిన గౌరవంగా అభివర్ణించింది.
Also read:
RRR Movie New Song : ఆర్ఆర్ఆర్ నుంచి కొమురం భీముడో పాట వచ్చేసింది.. ప్రాణం పెట్టి పాడిన కాలభైరవ..