Himalayas: మంచుఖండాన్ని తలపిస్తున్న హిమగిరులు.. ప్రకృతిలో పరవశించిపోతున్న పర్యాటకులు..
Himalayas: అక్కడి ప్రకృతి అందాలు మనసును దోచేస్తాయి. ఇప్పుడా అందాల్ని మరింత పెంచేసింది హిమపాతం. మంచుతో శ్వేతవర్ణంలో

Himalayas: అక్కడి ప్రకృతి అందాలు మనసును దోచేస్తాయి. ఇప్పుడా అందాల్ని మరింత పెంచేసింది హిమపాతం. మంచుతో శ్వేతవర్ణంలో మెరిసిపోతోంది లేహ్‌లోని హిమాలయ పర్వత శ్రేణి. హిమాలయాలు మంచుఖండాన్ని తలపిస్తున్నాయి. కొండ ప్రాంతమంతా దట్టమైన మంచు కమ్మేసింది. జమ్ముకశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. లేహ్‌లోని ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. కొండలపై ఉన్న లేహ్ ప్రాంతంలో ఎటుచూసినా మంచు కనిపిస్తూ, కనువిందు చేస్తోంది. చెట్లు, ఇళ్లు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నింటినీ కప్పేసింది మంచు. లేహ్ ప్రాంతం అంతా తెల్లని దుప్పటి పరిచినట్లు కనువిందు చేస్తోంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. శ్వేతవర్ణంతో ఆ ప్రాంతమంతా కొత్త అందాలను సంతరించుకుంది. కేంద్రపాలిత ప్రాంతం లఢాక్-లేహ్‌లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు స్థానిక ప్రజలు.
కాగా, హిమపాతం కారణంగా రోడ్లపై 2 నుంచి 3 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్లను క్లోజ్ చేశారు అధికారులు. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కులుగుతోంది. అటు మంచు పర్వతాల అందాలు పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి. పాల సముద్రాన్ని తలపిస్తున్న ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతున్నారు టూరిస్టులు. దట్టమైన మంచుమేటలతో నిండిన పరిసరాలు కాంతులను వెదజల్లుతున్నాయి. మంచు దుప్పటి కప్పుకోవడంతో పర్యాటక ప్రాంతాలు మరింతగా మెరిసిపోతున్నాయి. స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. మంచు చరియలు విరిగిపడే ప్రమాదముందని..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు ప్రజలు.
Also read: