AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pro Kabaddi League: ప్రో కబడ్డీ లీగ్ నాల్గో రోజు.. నేడు పుణెరి పల్టాన్‌తో తలపడనున్న తెలుగు టైటాన్స్.. మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి..

Pro Kabaddi League: క్రీడాకారులను, కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్   బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న..

Pro Kabaddi League: ప్రో కబడ్డీ లీగ్ నాల్గో రోజు.. నేడు పుణెరి పల్టాన్‌తో తలపడనున్న తెలుగు టైటాన్స్.. మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి..
Ipl Matches
Surya Kala
|

Updated on: Dec 25, 2021 | 8:25 AM

Share

Pro Kabaddi League: క్రీడాకారులను, కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్   బెంగళూరు వేదికగా జరుగుతోంది. కరోనా నిబంధనల నడుమ జరుగుతున్న ఈ ప్రో కబడ్డీ లీగ్  నేడు నాలుగో రోజుకు చేరుకుంది. 8వ సీజన్ లో టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు 12 జట్లు తలపడనున్నాయి. నాలుగో రోజు కూడా ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. నేడు తెలుగు ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించేలా తెలుగు టైటన్స్ బరిలోకి దిగనుంది. ఈరోజు సాయంత్రం తెలుగు టైటన్స్ పుణెరి పల్టాన్ తో తలపడనుంది. ఇప్పటికే  మొదటి రోజు తెలుగు టైటాన్స్ మ్యాచ్ ను డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగో రోజు జరిగే మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే..

నాలుగో రోజు మ్యాచ్‌ల వివరాలు.. Patna Pirates vs U.P. Yoddha: నాలుగో రోజు తొలి మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ , యూపీ యోధలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్నది.

Puneri Paltan vs Telugu Titans:  నాలుగో రోజు కబడ్డీ రెండో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్.. పుణెరి పల్టాన్ తో తలపడనుంది.   ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభంకానున్నది.

Jaipur Pink Panthers vs Haryana Steelers: ప్రో కబడ్డీ లీగ్ నాలుగో రోజు మూడో మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా స్టీలర్స్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

మ్యాచులు జరిగే వేదిక:  గత సీజన్లలో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి సీజన్ 8ని తటస్థ వేదికపై నిర్వహిస్తున్నారు.  ప్రేక్షకులు లేకుండా అన్ని మ్యాచ్‌లు బెంగళూరు వేదికగానే నిర్వహించనున్నారు.

Also Read:

ఒమిక్రాన్‌ టెన్షన్.. ఆ రాష్ట్రాల్లో నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ.. మహారాష్ట్ర సహా ఐదు రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి..