Pro Kabaddi League: నేడు ప్రో కబడ్డీ లీగ్ మూడో రోజు.. తలపడనున్న ఆరుజట్లు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Pro Kabaddi League Season 8: ప్రో-కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ డిసెంబర్ 22న కరోనా నిబంధనల నడుమ ప్రారంభమైంది. ఈ ఉత్కంఠ లీగ్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. నేడు మూడో రోజు.. ఏయే జట్లు ఏఏ జట్లతో తలపడనున్నాయంటే..
PKL 2021 Live Streaming Details: బెంగళూరు వేదికగా కరోనా నిబంధనల నడుమ ప్రో కబడ్డీ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ లీగ్ ఎనిమిదో సీజన్ ప్రారంభమై.. ఈరోజు మూడో రోజుకి చేరుకుంది. 8వ సీజన్ లో టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు 12 జట్లు తలపడనున్నాయి. మూడో రోజు కూడా ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి.
మూడో రోజు మ్యాచ్‌ల వివరాలు.. U Mumba vs Dabang Delhi K.C: మూడో రోజు తొలి మ్యాచ్ లో యు ముంబై, దబాంగ్ డిల్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Tamil Thalaivas vs Bengaluru Bulls: మూడో రోజు కబడ్డీ రెండో మ్యాచ్‌లో తమిళ తలైవా బెంగళూరు బుల్స్ ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభంకానున్నది.
Bengal Warriors vs Gujarat Giants: మూడో రోజు ప్రో కబడ్డీ లీగ్ మూడో మ్యాచ్‌లో బెంగళూరు వారియర్స్ తో గుజరాత్ గైన్ట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
మ్యాచులు జరిగే వేదిక: గత సీజన్లలో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి సీజన్ 8ని తటస్థ వేదికపై నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా అన్ని మ్యాచ్‌లు బెంగళూరు వేదికగానే నిర్వహించనున్నారు.
ప్రో-కబడ్డీ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూడొచ్చు. మీరు ఈ టోర్నమెంట్‌కి సంబంధించిన అన్ని అప్‌డేట్‌లను www.tv9telugu.comలో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.