Pro Kabaddi: ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. చివర్లో ఏం జరిగిందంటే..

ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌లో శనివారం జరిగిన మ్యాచ్‎లో తెలుగు టైటాన్స్‎పై పుణెరి పల్టాన్‌ ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది...

Pro Kabaddi: ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. చివర్లో ఏం జరిగిందంటే..
Pro Kabaddi
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 26, 2021 | 6:53 AM

ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో సీజన్‌లో శనివారం జరిగిన మ్యాచ్‎లో తెలుగు టైటాన్స్‎పై పుణెరి పల్టాన్‌ ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో తెలుగు టైటాన్స్ 33 పాయింట్లు సాధించగా.. పుణెరి పల్టాన్‌ 34 పాయింట్లు సాధించింది. మాచ్య్ 33-34 పాయింట్లు ఉన్న సందర్భంలో తెలుగు టైటాన్ నుంచి రైడ్‌కు వెళ్లిన రాకేష్‌ బోనస్‌ పాయింట్‌ సాధించాననే నమ్మకంతో తిరిగొచ్చాడు.

కానీ రిఫరీ పాయింట్‌ ఇవ్వలేదు. సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. దీంతో టైటాన్స్‌ 33-34తో చేజేతులారా ఓటమి పాలైంది. సిద్ధార్థ్‌ దేశాయ్‌ (15) పోరాటం వృథా అయింది. పల్టాన్‌ తరపున మోహిత్‌ (9) అస్లామ్‌ (8), అభినేష్‌ (5) రాణించారు. మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన టైటాన్స్‌ ఓ దశలో 17-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత సిద్ధార్థ్‌ సూపర్‌ రైడ్‌తో 20-14తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. కానీ రెండో భాగంలో పుంజుకున్న పుణెరి.. టైటాన్స్‌ను వెనక్కినెట్టింది.

మోహిత్‌, అస్లామ్‌ రైడింగ్‌కు తోడు.. డిఫెన్స్‌లో ఆ జట్టు బలంగా కనిపించింది. టైటాన్స్‌ను ఆలౌట్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ సిద్ధార్థ్‌ పోరాటం కొనసాగించడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారినా ఆఖర్లో ఓటమి చవిచూడక తప్పలేదు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 36-35తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. యూపీ ఆటగాడు పర్దీప్‌ (12), సుమిత్‌ (6).. పట్నా జట్టులో సచిన్‌ (10), ప్రశాంత్‌ (8), మహమ్మద్‌రెజా (7) ఆకట్టుకున్నారు. మూడో మ్యాచ్‌లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ 40-38తో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. జైపుర్‌ జట్టులో అర్జున్‌ (18), దీపక్‌ (10) సత్తాచాటారు. హరియాణా తరపున వికాస్‌ (14), రోహిత్‌ (7) రాణించారు.

Read Also.. IND vs SA: పంత్, సాహా.. తుది జట్టులో చోటు ఎవరికి.. రాహుల్ ద్రవిడ్ ఏం చెప్పాడు..