Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాటునాటు సాంగ్‌కు ఎమ్మెల్యే ఫేస్‌ మాస్క్‌తో ఇద్దరు విద్యార్థులు అదిరిపోయే డ్యాన్స్‌.. వీడియో వైరల్

Viral Video: ఎవరినైనా అభిమానిస్తే.. తమ అభిమానాన్ని విభిన్న రీతుల్లో ప్రకటిస్తుంటారు. సినీ నటులు, రాజకీయ నాయకులు లేదా క్రీడాకారులు ఇలా ఎవరిపైన అయినా..

Viral Video: నాటునాటు సాంగ్‌కు ఎమ్మెల్యే ఫేస్‌ మాస్క్‌తో ఇద్దరు విద్యార్థులు అదిరిపోయే డ్యాన్స్‌.. వీడియో వైరల్
Student Dance
Follow us
Surya Kala

|

Updated on: Dec 25, 2021 | 9:19 AM

Viral Video: ఎవరినైనా అభిమానిస్తే.. తమ అభిమానాన్ని విభిన్న రీతుల్లో ప్రకటిస్తుంటారు. సినీ నటులు, రాజకీయ నాయకులు లేదా క్రీడాకారులు ఇలా ఎవరిపైన అయినా అభిమానులు తమదైన శైలిలో తమ అభిమానాన్ని ప్రకటిస్తుంటారు. ఒకొక్కసారి.. హీరో, హీరోయిన్ లేదంటే రాజకీయ నాయుకుడి ముఖ చిత్రాలు కలిగిన మాస్క్‌లను  ధరించి.. వారిపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ స్కూల్లో విద్యార్థులు కూడా అదే పని చేశారు. అయితే, వారు కాస్త భిన్నంగా ప్రయత్నించి సంథింగ్ స్పెషల్ అనిపించారు. ఓ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఎమ్మెల్యే ఫేస్‌లతో ఉన్న మాస్క్‌లను ధరించి.. ఓ పాటకు డ్యాన్స్ చేశారు. ఆ మాస్కుకు ఉన్న ఫోటోలు ఎవరివో వివరాల్లోకి వెళ్తే..

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి ఫోటోలు. మార్కాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రత్యేకత చూపాలని స్కూల్ యాజమాన్యం.. విద్యార్థుల చేత వారి మాస్కులతో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమాలోని సాంగ్ కి డ్యాన్స్ చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల సాంగ్ ‘నాటు నాటు నాటు’ అనే పాటకు డాన్స్ ఇద్దరు స్టూడెంట్స్ డ్యాన్స్ చేశారు. ఇద్దరు విద్యార్థులు డ్యాన్స్ ఇరగదీశారు. ఎమ్మెల్యే ఫేస్ మాస్క్‌తో విద్యార్థులు చేసిన డ్యాన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఎమ్మెల్యేతో పాటు విద్ద్యార్థులు, విద్యార్దుల తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Also Read:  వెల్ల గ్రామంలో నకిలీ మందుల కలకలం.. ఆయుర్వేద షాపులో ఆయుష్ అధికారుల తనిఖీలు