Jamili Elections: 2029 నుంచి జమిలి ఎన్నికలు అమలుచేసేలా.. ఫార్ములా రూపొందిస్తున్న కమిషన్ కసరత్తు
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ, విపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే ఈ మధ్య జమిలి ఎన్నికల ప్రస్తావన రావడం అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లు తీసుకురానుందని.. విపక్ష పార్టీలు ఆరోపించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం విపక్షాలకు షాక్ ఇస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ, విపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే ఈ మధ్య జమిలి ఎన్నికల ప్రస్తావన రావడం అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లు తీసుకురానుందని.. విపక్ష పార్టీలు ఆరోపించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం విపక్షాలకు షాక్ ఇస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది. మరీ ఈ జమిలి ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే ప్రశ్న ఇంకా చాలా మందిని వెంటాడుతోంది. జమిలి ఎన్నికలు అమలు చేయాల్సి వస్తే.. ఏకకాలంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో సహా లోక్ సభ ఎలక్షన్లు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు లా కమిషన్.. 2024 లో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది.
దీంతో 2029లో ఈ జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఓ ఫార్ములాను రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకూ ఓకేసారిగా నిర్వహించే ఎన్నికలకు సంబంధించి.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఇటీవల ఏర్పాటు చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ కమిటీ ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులపై తమ కసరత్తును ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను కూడా తమ ఫార్ములాలో ఇమిడేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం లా కమిషన్‌ను కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ముందుగా అప్పగించినటువంటి బాధ్యత…లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహించడం. అయితే ఇందుకు సంబంధించి లా కమిషన్ నివేదిక పలు కారణాల వల్ల ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. 2029లో ఈ జమిలి ఎన్నికలను సాధ్యం చేయడానికి అలాగే శాసనసభల గడువులను కూడా సర్దుబాటు చేయడానికి.. అంటే కొన్నింటి శాసనసభల కాల వ్యవధి పొడిగించడం, కొన్నిటికి తగ్గించడానికి సంబంధించి జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని ప్రస్తుత లా కమిషన్ పలు సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జత చేయాల్సి వచ్చినట్లైతే.. మొదటి దశలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని.. అలాగే రెండో దశలో స్థానిక సంస్థలు అంటే పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ ఎన్నికలు జరపాలని సూచనలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఈ రెండు దశలనూ కూడా ఒక ఏడాదిలోనే నిర్వహించాలని సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది . కేంద్ర ప్రభుత్వం వీటికి అంగీకరించినట్లైతే.. మొత్తం మూడు అంచెల ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఈ లా కమిషన్ విధి విధానాలను రూపొందిస్తుంది. అయితే ఈ ఉమ్మడి ఓటర్ల జాబితా వల్ల ఖర్చు తగ్గడంతో సహా ఒకే రకమైనటువంటి పని కోసం మళ్లీ మానవ వనరులను ఉపయోగించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు ఉండదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది..