Cyber crime: పెట్టుబడులతో ఆశ చూపారు.. కట్ చేస్తే రూ.854 కోట్లు దోచుకున్నారు

దేశంలో సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరిగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు ఈ సైబర్ కేటూగాళ్ల మాయలో పడి మోసపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పటి నుంచో భద్రంగా దాచుకుంటున్న తన సొమ్మును సైబర్ నేరగాళ్లకు కట్టబెడుతున్నారు. వేలు, లక్షలు మరికొందరైతే కోట్లు కూడా పొగొట్టున ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో భారీ మోసం వెలుగుచూసింది.

Cyber crime: పెట్టుబడులతో ఆశ చూపారు.. కట్ చేస్తే రూ.854 కోట్లు దోచుకున్నారు
Cyber Crime
Follow us
Aravind B

|

Updated on: Sep 30, 2023 | 3:30 PM

దేశంలో సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరిగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు ఈ సైబర్ కేటూగాళ్ల మాయలో పడి మోసపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పటి నుంచో భద్రంగా దాచుకుంటున్న తన సొమ్మును సైబర్ నేరగాళ్లకు కట్టబెడుతున్నారు. వేలు, లక్షలు మరికొందరైతే కోట్లు కూడా పొగొట్టున ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో భారీ మోసం వెలుగుచూసింది. దాదాపు 854 కోట్ల రూపాయల భారీ ఆన్‌లైన్‌ మోసాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. పెట్టుబడులు పెడితే రోజుకు 5వేల రూపాయలు లాభం పొందవచ్చు అని ఆశచూపి.. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది నుంచి సైబర్‌ కేటుగాళ్లు కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ స్కామ్‌‌ గుట్టును బయటపెట్టిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అంతేకాదు వారి నుంచి ఏకంగా దాదాపు 5 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి సోషల్ మీడియాలో బాధితులకు పెట్టుబడులు పెడితే అధికంగా లాభాలను సొంతం చేసుకోవచ్చని ఆశ చూపారని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 1000 రూపాయల నుంచి 10వేల వరకు పెట్టుబడులు పెట్టినట్లైతే.. రోజుకు వెయ్యి నుంచి 5వేల రూపాయల వరకు లాభం పొందవచ్చని నిందితులు ప్రచారాలు చేశారు. దీనివల్ల దేశవ్యాప్తం ఉన్న పలు నగరాల్లో చాలా మంది చిన్న చిన్న మొత్తాలతో తమ పెట్టుబడులను ప్రారంభించారు. ఇలా వాళ్లు పెట్టుబడులు పెట్టిన కొన్ని రోజులకు వాటిపై లాభాలు రావడం మొదలయ్యాయి. ఇక ఆ సంతోషాన్ని తట్టుకులేక కొంతమంది ఏకంగా లక్ష నుంచి 10లక్షల రూపాయల వరకు పెట్టుబడులను పెట్టారు.

ఆన్‌లైన్‌లోని వివిధ బ్యాంకు ఖాతాల్లో బాధితులు సైబర్ నేరస్థులు చెప్పిన ఈ పెట్టుబడులు పెట్టారు. అయితే, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తైపోయిన తర్వాత.. వారికి ఎటువంటి లాభాలు కూడా రాలేదు. దీనివల్ల వారు తమ డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది విఫలమైంది. ఇక చివరికి మోసపోయామని గ్రహించారు బాధితులు. చేసేదేమి లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు విచారణ చేయడం మొదలుపెట్టగా.. ఆశ్చర్యపోయే విషయాలు బయటికి వచ్చాయి. ఇక దేశవ్యాప్తంగా వేలాది మంది ఈ కుంభకోణానికి మోసపోయారు. వీళ్ల నుంచి నిందితులు ఏకంగా 854 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు తేలింది. ఇక చివరికి మోసపోయిన బాధితుల నుంచి పెట్టుబడులు సేకరించిన అనంతరం.. నిందితులు ఆ మొత్తాన్ని క్రిప్టో, పేమెంట్‌ గేట్‌వే, గేమింగ్‌ యాప్స్‌ వంటి వివిధ ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై మరింత ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది..