AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: వర్షం కోసం తలకావేరిలో అభిషేక్, అవివా దంపతుల ప్రత్యేక పూజలు.. రైతులకు అండగా..

తలకావేరిలో అభిషేక్ అంబరీష్-అవివా దంపతులు ప్రత్యేక పూజలు నటుడు అభిషేక్ అంబరీష్, అవివా దంపతులు వర్షం కోసం పూజలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. కొడగు జిల్లా తలకావేరిలో దంపతులు పర్యటించారు. వర్షం కోసం ప్రార్థించడమే కాకుండా కావేరి వివాద పరిష్కారం కోసం ప్రార్థించారు. రైతులకు అండగా ఉండేందుకు అంబరీష్ తన భుజాలపై పచ్చటి టవల్ వేసుకున్నారు.

Karnataka: వర్షం కోసం తలకావేరిలో అభిషేక్, అవివా దంపతుల ప్రత్యేక పూజలు.. రైతులకు అండగా..
Abhishek Ambareesh
Surya Kala
|

Updated on: Sep 30, 2023 | 1:31 PM

Share

ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు సరిగా పడడం లేదు. ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంటలు సాగు చేసేందుకు సరైన నీరులేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురవాలని కొందరు ప్రత్యేక పూజలు చేశారు. నటుడు అభిషేక్ అంబరీష్, అవివా దంపతులు వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. కొడగు జిల్లా తలకావేరిలో దంపతులు పర్యటించారు. వర్షం కోసం ప్రార్థించడమే కాకుండా, కావేరి వివాదాన్ని పరిష్కరించాలని కూడా ప్రార్థించారు. రైతులకు అండగా తాను ఉన్నానంటూ అంబరీష్ తన భుజాలపై పచ్చటి టవల్ వేసుకున్నారు.

అభిషేక్ అంబరీష్ సుమలత, అంబరీష్ ల తనయుడు. కన్నడ చలనచిత్ర పరిశ్రమ యువ నటుడు. అభిషేక్ అంబరీష్ భార్య అవివా ఇటీవల ఫారెస్ట్ సఫారీలో సరదాగా గడిపారు. అవివా తన అనుభవాలను కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

అవివా బిడపా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అక్కడ దంపతులు తాము గడిపిన ప్రత్యేక క్షణాల ఫోటోలను షేర్ చేసింది. తాను అభిషేక్‌తో గడిపిన క్షణాలను హైలైట్ చేస్తూ కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేయడంతో పాటు అవివా వాటికి “జంగిల్ టింగ్స్” అని క్యాప్షన్ ఇచ్చింది. అభిషేక్ నల్లటి టీ-షర్ట్, నలుపు రంగు టోపీతో జత చేసిన తెల్లని షార్ట్‌లో సూపర్ చిల్‌గా కనిపిస్తున్నాడు. అవివా బ్లాక్ టీ-షర్ట్, లెగ్గింగ్స్‌లో స్టన్స్ లుక్స్ తో అందంగా కనిపిస్తున్నారు ఈ జోడీ..

View this post on Instagram

A post shared by Mrs. Abishek (@avivabidapa)

అభిషేక్ అంబరీష్, అవివా బిడపా ప్రేమ కథ ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో ప్రారంభమైంది. అప్పట్లో వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లకు దారి తీసింది. గత ఏడాది డిసెంబర్ 11న ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకుని తమ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించారు. అభిషేక్‌కు చలనచిత్ర పరిశ్రమ, రాజకీయాలు రెండింటిలోనూ నేపథ్యం ఉంది. ప్రఖ్యాత కుటుంబం నుండి వచ్చిన అవివా బహుముఖ ప్రతిభావంతురాలు, నటిగా, మోడల్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది..