Tirumala: తిరుమలలో భారీ కొండ చిలువ.. ఫారెస్ట్‌ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టిమరీ లొంగిన ఫైథాన్

తిరుమల క్షేత్రానికి వెళ్లే అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో ఇటీవల క్రూరమృగాలు భక్తులను హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులపై చిరుతలు, ఎలుగుబంట్లు దాడులు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక నిఘాతో చిరుతలను బంధించి అటవీప్రాంతానికి తరలిస్తున్నారు. తాజాగా తిరుమలలో కొండచిలువ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వెంటనే టీటీడీ ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు.

Tirumala: తిరుమలలో భారీ కొండ చిలువ.. ఫారెస్ట్‌ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టిమరీ లొంగిన ఫైథాన్
Photon Hulchul
Follow us
Surya Kala

|

Updated on: Sep 30, 2023 | 10:35 AM

కలియుగ దైవం శ్రీ వెంటకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం.. ఇల వైకుంఠంగా కీర్తించబడుతుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో క్షేత్రానికి చేరుకుంటారు. అయితే గత కొంతకాలంగా తిరుమలకు వెళ్తున్న భక్తులను వన్య మృగాలు హడలెత్తిస్తున్నాయి. తిరుమల క్షేత్రానికి వెళ్లే అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో ఇటీవల క్రూరమృగాలు భక్తులను హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులపై చిరుతలు, ఎలుగుబంట్లు దాడులు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక నిఘాతో చిరుతలను బంధించి అటవీప్రాంతానికి తరలిస్తున్నారు. తాజాగా తిరుమలలో కొండచిలువ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వెంటనే టీటీడీ ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు.

తిరుమల.. బాలాజీ నగర్ లో 816 వ నెంబర్ ఇంట్లో 12 అడుగుల కొండచిలువ చొరబడింది. అంత పెద్ద కొండచిలువను చూసి భయంతో వణికిపోయారు ఆ ఇంటిలోని సభ్యులు, స్థానికులు. టీటీడీ ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అటవీ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్న  కొండచిలువను బంధించారు. ఈ క్రమంలో కొండచిలువ తనను బంధించడానికి వచ్చిన వారిపై దాడికి యత్నించింది. ఫారెస్ట్‌ సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టింది. మొత్తానికి కొండ చిలువను బంధించారు. 30 కిలోలకు పైగా బరువున్న ఆ భారీ కొండ చిలువను సిబ్బంది తీసుకెళ్లి సురక్షితంగా అవ్వాచారి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..