Koyta Gang: మార్కెట్‌లోకి కొడవలి గ్యాంగ్.. వస్తారు.. వేటేస్తారు.. వెళ్లి పోతారు..! దడపుట్టించే వీడియో..
కొడవలి ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయి. పుణె జిల్లాలోని సమీపంలోని పింప్రీ- చించ్‌వడ్ నగరంలో ఓ మెడికల్ దుకాణంలోకి ఎంటరైన ఈ గ్యాంగ్.. సిబ్బందిపై దాడి చేశాయి. పూణె జిల్లాలోని పింప్రి చించ్‌వాడ్‌లోని ఒక మెడికల్ షాపులోకి చొరబడ్డ ఆరుగురు ముఠా కలిగిన గ్యాంగ్ కొడవళ్లతో
మహారాష్ట్రలో కొడవలి ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయి. పుణె జిల్లాలోని సమీపంలోని పింప్రీ- చించ్‌వడ్ నగరంలో ఓ మెడికల్ దుకాణంలోకి ఎంటరైన ఈ గ్యాంగ్.. సిబ్బందిపై దాడి చేశాయి. పూణె జిల్లాలోని పింప్రి చించ్‌వాడ్‌లోని ఒక మెడికల్ షాపులోకి చొరబడ్డ ఆరుగురు ముఠా కలిగిన గ్యాంగ్ కొడవళ్లతో మరోసారి రెచ్చిపోయింది. కొడవలి లాంటి కత్తులు చేతపట్టి మెడికల్ షాష్ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశాయి. వారిని బెదిరించడంతోపాటు ఆ మెడికల్ షాప్‌ను ధ్వంసం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. భయాందోళన నుంచి బయటపడిన ఆ మెడికల్ షాపు సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు షాపులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కొడవళ్లు చేతపట్టిన ఆ గ్యాంగ్ మెడికల్ షాప్ సిబ్బందిపై దాడికి ముందు కామ్‌గర్ నగర్ ప్రాంతంలో కొన్ని వాహనాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వీడియో చూడండి..
पिंपरीत कोयटा टोळीची दहशत. मेडिकल स्टोअरच्या मालकावर हल्ला करून दुकानाची तोडफोड कशी केली हे आपण पाहू शकतो. शुक्रवार आणि शनिवारी मध्यरात्री ते परिसरातील अनेक वाहनांची तोडफोड करतानाही दिसले. ही संपूर्ण घटना सीसीटीव्हीत कैद झाली आहे. pic.twitter.com/hSC3caHh6X
— ℝ?? ???? (@Rajmajiofficial) April 29, 2023
మరోవైపు గత నాలుగు నెలల్లో పూణేతోపాటు మహారాష్ట్రలోని పలు చోట్ల కొడవళ్ల గ్యాంగ్ ముఠాల దాడులు ఎక్కువయ్యాయి. వందకుపైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు.
దీంతో ‘కొడవళ్ల గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఈ ముఠాల ఆగడాలు ఆగడం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..