Bank Fraud: ఎస్బీఐ బ్యాంకును బురిడి కొట్టించిన వ్యాపారవేత్త..రూ.95 కోట్లు మోసం

Aravind B

Aravind B |

Updated on: Apr 01, 2023 | 6:40 PM

నీరవ్ మోదీ, విజయ్ మాల్య లాంటి వాళ్లు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వాళ్లను ఇంతవరకు అరెస్టు చేయలేకపోయారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

Bank Fraud: ఎస్బీఐ బ్యాంకును బురిడి కొట్టించిన వ్యాపారవేత్త..రూ.95 కోట్లు మోసం
SBI
Follow us

నీరవ్ మోదీ, విజయ్ మాల్య లాంటి వాళ్లు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వాళ్లను ఇంతవరకు అరెస్టు చేయలేకపోయారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇంకా చాలామంది బ్యాంకులను మోసం చేసి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే తాజాగా మరో వ్యాపారవేత్త ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్ బీఆని బరిడి కొట్టించాడు. సుమారు రూ.95 కోట్లు బ్యాంకు నుంచి అక్రమంగా తీసుకొని మోసం చేశాడు. వివరాల్లోకి వెళ్తే కలకత్తాకు చెందిన కౌషిక్ కుమార్ నాథ్ అనే వ్యాపారవేత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో నకిలీ డ్యాకుమెంట్లు సమర్పించి క్రెడిట్ సౌకర్యాలను పొందాడు.

అయితే ఆ క్రెడిట్ సౌకర్యాల రూపంలో వచ్చిన డబ్బులను కౌషిక్ విత్ డ్రా చేసుకున్నాడు. అయితే వాటిని ఆ బ్యాంకు మంజూరు చేసిన ప్రయోజనాల కింద కాకుండా ఇతర అవసరాల కోసం కౌషిక్ వాడుకున్నాడు. దాదాపు ఇలా రూ.95 కోట్ల వరకు డబ్బులు దండుకున్నాడు. చివరికి అతని బండారం బయటపడటంతో ఈడీ అధికారులు కౌషిక్ పై మనిలాండరింగ్ కేసు నమోదు చేసి మార్చి 30 న అరెస్టు చేశారు. కలకత్తాలోని మనీలాండరింగ్ కోర్టులో కౌషిక్ ను హాజరుపరచగా.. ఏప్రిల్ 10 వరకు ఈడీ విచారణకు కోర్టు ఆదేశించింది. అయితే కౌషిక్ తరచుగా తన గుర్తింపును మార్చుకుంటూ బ్యాంకులను మోసం చేస్తున్నాడని ఈడీ అధికారులు తెలిపారు. అతని నుంచి సుమారు రూ.3.68 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu