ఖాకీ దూస్తుల్లో ఉన్నవారిని కరిచేలా శునకాలకు శిక్షణ.. చివరికి
ఖాకీ డ్రెస్‌లో ఉన్న వారిని కరిచేలా కుక్కలకు ఒక వ్యక్తి శిక్షణ ఇవ్వడం కలకలం రేపుతోంది. సోదాల కోసం అతడి ఇంటికి వెళ్లిన పోలీసులపై ఆ కుక్కలు దాడిచేయబోయాయి. అయితే ఆ పోలీసులు తృటిలో తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. దీనివల్ల డ్రగ్స్ డీలర్‌గా అనుమానిస్తున్నటువంటి ఆ వ్యక్తి అక్కడి నుంచి సులువుగా తప్పించుకున్నాడు. అయితే ఈ కేసు దర్యాప్తు చేయగా.. ఆ నిందితుడు ఖాకీ డ్రెస్‌లో ఉన్న వారిని కరిచేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు.

ఖాకీ డ్రెస్‌లో ఉన్న వారిని కరిచేలా కుక్కలకు ఒక వ్యక్తి శిక్షణ ఇవ్వడం కలకలం రేపుతోంది. సోదాల కోసం అతడి ఇంటికి వెళ్లిన పోలీసులపై ఆ కుక్కలు దాడిచేయబోయాయి. అయితే ఆ పోలీసులు తృటిలో తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. దీనివల్ల డ్రగ్స్ డీలర్‌గా అనుమానిస్తున్నటువంటి ఆ వ్యక్తి అక్కడి నుంచి సులువుగా తప్పించుకున్నాడు. అయితే ఈ కేసు దర్యాప్తు చేయగా.. ఆ నిందితుడు ఖాకీ డ్రెస్‌లో ఉన్న వారిని కరిచేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. కేరళలోని కొట్టాయం ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మాదకద్రవ్యాల వ్యాపారిగా అనుమానించిన వ్యక్తి ఇంట్లో సోదాల కోసం యాంటీ నార్కోటిక్ స్క్వాడ్ అలాగే స్థానిక పోలీసులు కలిసి ఆదివారం రాత్రి సోదాలు నిర్వహించారు.
అయితే ఈ నేపథ్యంలోనే అతడి ఇంట్లో ఉన్నటువంటి సుమారు 13 కుక్కలు పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. కానీ పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో వారు తృటిలోనే తప్పించుకోగలిగారు. అయితే ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఉతంతం జరిగిన అనంతంరం పోలీసులు ఆ కుక్కలను తమ అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఆ వ్యక్తి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. అలాగే సుమారు 17 కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు కొట్టాయం ఎస్పీ కార్తీక్ సోమవారం మీడియాతో కూడా మాట్లాడారు. అయితే ఆ వ్యక్తి ఇంట్లో అన్ని కుక్కలు ఉంటాయని కూడా తాము ఊహించలేదని పేర్కొన్నారు. ఖాకీ డ్రెస్‌లో ఎవరైనా కనబడితే వెంటనే వారిపై దాడి చేసి కరిచేలా ఆ కుక్కలకు అతడు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. మరోవిషయం ఏంటంటే రిటైర్డ్ బీఎస్‌ఎఫ్ అధికారి ద్వారా అతడు డాగ్ ట్రైనింగ్‌లో శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. అలాగే డాగ్ శిక్షణ మాటున డ్రగ్స్ డీలింగ్ కూడా చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. మరోవైపు అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి ఆ వ్యక్తి డాగ్ శిక్షకనిగా స్థానికులకు కూడా ఈ విషయం తెలుసని ఎస్పీ కార్తీక్ అన్నారు. అయితే కొందరు బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రతిరోజు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి తమ పెంపుడు కుక్కలను అతడికి అప్పగించేవాళ్లని చెప్పారు. ప్రస్తుతం అతడి ఇంటి వద్ద 13 వరకు జాతి కుక్కలు ఉన్నాయని.. వాటి యజమానులను గుర్తించిన తర్వాత వాళ్లకు అప్పగిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే డ్రగ్స్ డీలింగ్ విషయంలో కూడా ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా లేదా అనే విషయంపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




