Heartwarming: హ్యాట్సాఫ్ చిట్టితల్లి.. క్యాన్సర్ పేషెంట్ కోసం ఈ చిన్నారి ఏం చేసిందో తెలిస్తే ఫిదా అయిపోతారు..
‘పిల్లలు దేవుడు చల్లని వారే.. కల్లకపటమెరుగని కరుణామయులే’.. లేత మనసులు సినిమాలో ఆరుద్ర రచించి, పి సుశీల నోట గాత్రమై వచ్చిన ఈ పాటు.. ఎవర్‌గ్రీన్ హిట్ సాంగ్. ఆ పాటలోని లిరిక్స్ అక్షరాలా నిజం. పిల్లలు, దేవుడి ఒకటే.. వారి మనసులో ఎలాంటి కల్లాకపటడం ఉండదు. తమకు తోచింది చేస్తారు. స్వచ్ఛమైన మనసుతో చిరునవ్వులు చిందిస్తారు. తాజాగా ఓ చిట్టి తల్లి తన పెద్దు మనసులో చేసిన పనికి సమాజం మొత్తం తల వంచుతోంది. హ్యాట్సాఫ్ చిట్టితల్లి అంటూ మోకరిల్లుతోంది. అవును, ఆ చిన్నారి అంత గొప్ప పని చేసింది. సరిగ్గా ఐదేళ్లు కూడా నిండని ఆ చిన్నారు..

‘పిల్లలు దేవుడు చల్లని వారే.. కల్లకపటమెరుగని కరుణామయులే’.. లేత మనసులు సినిమాలో ఆరుద్ర రచించి, పి సుశీల నోట గాత్రమై వచ్చిన ఈ పాటు.. ఎవర్‌గ్రీన్ హిట్ సాంగ్. ఆ పాటలోని లిరిక్స్ అక్షరాలా నిజం. పిల్లలు, దేవుడి ఒకటే.. వారి మనసులో ఎలాంటి కల్లాకపటడం ఉండదు. తమకు తోచింది చేస్తారు. స్వచ్ఛమైన మనసుతో చిరునవ్వులు చిందిస్తారు. తాజాగా ఓ చిట్టి తల్లి తన పెద్దు మనసులో చేసిన పనికి సమాజం మొత్తం తల వంచుతోంది. హ్యాట్సాఫ్ చిట్టితల్లి అంటూ మోకరిల్లుతోంది. అవును, ఆ చిన్నారి అంత గొప్ప పని చేసింది. సరిగ్గా ఐదేళ్లు కూడా నిండని ఆ చిన్నారు.. నిండు మనసులో గొప్పపని చేసింది. అందతో శభాష్ తల్లీ అనిపించుకుంటోంది. మరి ఇంతకీ ఆ చిట్టితల్లి ఏం చేసిందో తెలుసుకుందామా..
త్రిపురలోని శిశు బీహార్ స్కూల్‌కు చెందిన ఐదేళ్ల విద్యార్థిని అనసూయ ఘోష్ నిస్వార్థత మనసును హత్తుకునేలా చేస్తోంది. తన జుట్టును కత్తిరించి క్యాన్సర్ పేషెంట్‌కు దానం చేసింది. ఈ దానంతో ఆ చిట్టితల్లి ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది. ద్వారా పలువురి హృదయాలను తాకింది. అనసూయ ఘోష్(5) కుటుంబ నేపథ్యం కూడా ఉన్నత చదువులు కలిగిన వారే. ఆమె తల్లి నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అయితే, తన తల్లిదండ్రుల ప్రేరణతో ఈ ఐదేళ్ల చిన్నారి కీమోథెరపీ కారణంగా తన వెంట్రుకలన్నీ కోల్పోయిన 50 ఏళ్ల క్యాన్సర్ రోగికి తన జుట్టును దానం చేసింది. తద్వారా క్యాన్సర్ బాధితులకు తామున్నామని, ఎవరూ ఆత్మన్యూనతా భావానికి లోనవ్వొద్దంటూ భరోసా కల్పించే సందేశాన్ని పంపించే ప్రయత్నం చేసింది.
చిన్నారి ప్రస్తుతం శిశు బీహార్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో కిండర్ గార్టెన్ IIలో చేరింది. నాగ్‌పూర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఒక వృద్ధ మహిళ గురించి అనసూయ తల్లి సీమా చక్మా బెంగళూరుకు చెందిన ఒక ఎన్జీవో ద్వారా తెలుసుకున్నారు. ఈ మహిళ దీనస్థితిని చూసి చలించిపోయిన వారు తమ కూతురి పొడవాటి జుట్టును ఆమె హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ దానం ద్వారా క్యాన్సర్ రోగి కోలుకోవడానికి సహకరించే అవకాశం కల్పించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే, తన జుట్టు ఇవ్వాల్సి ఉంటుందని అనసూయను కోరగా.. సంతోషంగా అంగీకరించింది. చిన్నారి తండ్రి వివిధ సామాజిక సేవా సంస్థల్లో చురుకుగా పాల్గొంటుంటారు. ఈ విధంగా చిన్నారి అనసూయకు తల్లిదండ్రుల నుంచి ప్రేరణ లభించింది.

Girl Donate Hair
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
