ఫిబ్రవరి-14తో కేజ్రీవాల్‌కు విడదీయరాని బంధం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళుతోంది. ఎగ్జిట్‌పోల్స్‌ని అంచనాలను నిజం చేస్తూ భారీ విజయాన్ని మూటగట్టుకుంటోంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం దాదాపుగా ఖరారైంది. అయితే ఫిబ్రవరి-14న ప్రేమికులకే కాదు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి కూడా ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. 2013లో కాంగ్రెస్‌తో విభేదాల వల్ల 14 ఫిబ్రవరి 2014న సీఎం పదవికి రాజీనామా చేశారు. 2015లో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఫిబ్రవరి 14నే సీఎంగా ప్రమాణ స్వీకారం […]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళుతోంది. ఎగ్జిట్‌పోల్స్‌ని అంచనాలను నిజం చేస్తూ భారీ విజయాన్ని మూటగట్టుకుంటోంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం దాదాపుగా ఖరారైంది. అయితే ఫిబ్రవరి-14న ప్రేమికులకే కాదు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి కూడా ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. 2013లో కాంగ్రెస్‌తో విభేదాల వల్ల 14 ఫిబ్రవరి 2014న సీఎం పదవికి రాజీనామా చేశారు. 2015లో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఫిబ్రవరి 14నే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు మళ్లీ ఆప్ అధికారంలోకి రానుండటంతో ఫిబ్రవరి 14నే కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి లవర్స్ డే క్రేజీ.. కేజ్రీవాల్‌కు కూడా బాగానే వర్కౌట్ అవుతుందంటున్నారు.
కాగా.. గెలుపు ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో కేజ్రీవాల్ తమ పార్టీ క్యాడర్‌కు ఓ ముఖ్య సూచన చేశారు. విజయోత్సవాలు జరుపుకోండి కానీ.. బాణాసంచా మాత్రం కాల్చకండని ఆదేశించారు. క్రాకర్స్ కాల్చే బదులు స్వీట్లు పంపిణీ చేయండని హితవు చెప్పారు. ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.