AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్తతో ఆ యవ్వారం.. అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యనే కడతేర్చిన కిరాతకుడు

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు వావీవరసలు మరిచి ప్రవర్తిస్తూ మానవసంబంధాలను మంటగలుపుతున్నారు. పెళ్లైనా ఇతరులతో సంబంధాలు పెట్టుకొని అడ్డు చెప్పిన భాగస్వాములను హత్య చేసి అంతకులుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో వెలుగు చూసింది. అత్తతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చాడు.

అత్తతో ఆ యవ్వారం.. అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యనే కడతేర్చిన కిరాతకుడు
Up Crime News
Anand T
|

Updated on: Oct 08, 2025 | 5:49 PM

Share

అత్తతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే… సిధ్‌పూర్‌ నివాసి అయిన 20 ఏళ్ల శివానికి 2018లో ప్రమోద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్నేళ్లకు ప్రమోద్‌కు తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలియడంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఇలా గొడవలు జరిగిన ప్రతిసారి ప్రమోద్, శివానిపై దాడికి పాల్పడేవాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.

అయితే ఇదే విషయంపై ఇటీవల ప్రమోద్, శివాని మధ్య వివాదం తలెత్తింటి దీంతో ప్రమోద్, అతని అత్తతో కలిసి శివానిపై దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో రక్తపు మడుగుల్లో పడి ఉన్న 20 ఏళ్ల శివాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఈ హత్య తర్వాత, ప్రమోద్, అతడి అత్తలకు సంబంధించిన అనేక అసభ్యకరమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి కాస్తా పోలీసుల దృష్టికి చేరడంతో వివాహేతర సంబంధం కారణంగా ప్రమోదే శివానికి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోద్, అతని అత్త కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా