AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: ‘వాటన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం’.. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మాజీ మంత్రి కామెంట్స్..

Karnataka: కర్నాకట మాజీ మంత్రి, బీజేపీ కేఎస్ ఈశ్వరప్ప సంచలన కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తున్న ఆయన..

Karnataka: ‘వాటన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం’.. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మాజీ మంత్రి కామెంట్స్..
Ks Eshwarappa
Shiva Prajapati
|

Updated on: May 28, 2022 | 7:39 PM

Share

Karnataka: కర్నాకట మాజీ మంత్రి, బీజేపీ కేఎస్ ఈశ్వరప్ప సంచలన కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తున్న ఆయన.. తాజాగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఉత్తరాదిన జ్ఞానవాపి వివాదం నడుస్తుండగా.. దానికి కొనసాగింపు అన్నట్లుగా షాకింగ్ కామెంట్స్ చేశారు. వేలాది హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయని, వాటి శిథిలాలపై మసీదుల నిర్మాణం జరిగిందని అన్నారు. వాటిని స్వాధీనం చేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారాయన.

మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఏమన్నారంటే.. ‘‘36,000 దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. వాటి శిథిలాలపై మసీదులు నిర్మించారు. ఆ వర్గానికి మరోచోట మసీదులు నిర్మించి నమాజ్ చేయనివ్వండి, కానీ మా దేవాలయాలపై మసీదులను నిర్మించడాన్ని మేము అంగీకరించం. మొత్తం 36,000 దేవాలయాలను హిందువులంతా కలిసి చట్టబద్ధంగా తిరిగి స్వాధీనం చేసుకుంటాం.’’ అని అన్నారు. కేఎస్ ఈశ్వరప్ప చేసిన ఈ కామెంట్స్ దక్షిణాదిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కామెంట్స్ ఎటువైపు దారి తీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us