AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: బావిలో దూకిన అక్కాచెల్లెళ్లు.. చిన్నారులతో సహా ఐదుగురు మృతి.. కారణం అదేనా..?

రాజస్థాన్(Rajastan) జైపుర్​లో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు అడుగడుగునా వేధింపులే స్వాగతం పలికాయి. ఎలాగోలా సర్దుకుని కలిసి ఉందామనుకున్నప్పటికీ.. రోజురోజుకు పెరిగిపోతున్న...

Rajasthan: బావిలో దూకిన అక్కాచెల్లెళ్లు.. చిన్నారులతో సహా ఐదుగురు మృతి.. కారణం అదేనా..?
crime news
Ganesh Mudavath
|

Updated on: May 28, 2022 | 7:56 PM

Share

రాజస్థాన్(Rajastan) జైపుర్​లో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు అడుగడుగునా వేధింపులే స్వాగతం పలికాయి. ఎలాగోలా సర్దుకుని కలిసి ఉందామనుకున్నప్పటికీ.. రోజురోజుకు పెరిగిపోతున్న వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలతో కలిసి పుట్టింటికి పయనమయ్యారు. పుట్టింటి వారు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో గత్యంతరం లేకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకొని దుదూస్టేషన్ పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు అక్కాచెల్లెళ్లు అని పోలీసులు తెలిపారు. వీరిని కాలీ దేవి(27), మమతా దేవి(23), కమ్లేశ్​ మీనాగా(20) గుర్తించారు. చనిపోయిన చిన్నారుల్లో నాలుగేళ్ల బాలుడు హర్షిత్, 20 రోజుల శిశువు ఉన్నట్టు వెల్లడించారు.

రాజస్థాన్ లోని జైపుల్ రూరల్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో వివాహమైంది. పెళ్లయినప్పటికి నుంచి వారికి అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. పది రోజలు క్రితం ముగ్గురు అక్కా చెల్లెళ్లను తీవ్రంగా కొట్టి, ఇంట్లో నుంచి గెంటేశారు. గత్యంతరం లేక ముగ్గురూ తమ పుట్టింటికి వచ్చారు. గొడవను పరిష్కరించేందుకు బాధిత మహిళల కుటుంబసభ్యులు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఇక చేసేదేమీ లేక ముగ్గురూ తమ పిల్లలతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మార్కెట్​కు వెళ్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళలు.. తిరిగి రాలేదని మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సరిగ్గా స్పందించలేదని మృతుల కుటుంబీకులు ఆవేదన చెందారు.

ఇదే సమయంలో పోలీసులకు బావిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగి 24 గంటలు అయినా.. పోలీసులు స్పందించకపోవడంతో తాము మహిళా కమిషన్​ను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులనూ కలిశామన్నారు. అయితే, ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదు చేయొద్దని స్థానిక ఎమ్మెల్యే తమపై ఒత్తిడి చేశారని ఆవేదన చెందారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు స్పందించారని వెల్లడించారు. కట్నం కోసం తమను వేధించారని మృతుల సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!