AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangna Ranaut: కంగనా రనౌత్‌పై చేయి చేసుకున్నమహిళా కానిస్టేబుల్‌.. సస్పెండ్ చేసిన అధికారులు

చండీగఢ్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటన అనంతరం ఢిల్లీకి చేరుకున్న కంగనా రనౌత్.. సీనియర్ అధికారుల సమక్షంలో, ఆమె ఈ సంఘటన గురించి CISF డైరెక్టర్ జనరల్ నీనా సింగ్‌కు ఫిర్యాదుచేశారు. చండీగఢ్ విమానాశ్రయంలోని కర్టెన్ ఏరియాలో కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తనతో వాదించి చెంపదెబ్బ కొట్టారని కంగనా వివరించారు.

Kangna Ranaut: కంగనా రనౌత్‌పై చేయి చేసుకున్నమహిళా కానిస్టేబుల్‌.. సస్పెండ్ చేసిన అధికారులు
Kangana Ranaut
Shaik Madar Saheb
|

Updated on: Jun 06, 2024 | 9:06 PM

Share

చండీగఢ్ విమానాశ్రయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు తనపై దాడి జరిగినట్లు కంగనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నానని.. ఈ సమయంలో సెక్యూరిటీ చెక్-ఇన్ తర్వాత బోర్డింగ్ కోసం వెళుతున్నప్పుడు LCT కుల్విందర్ కౌర్ (CISF యూనిట్ చండీగఢ్ ఎయిర్‌పోర్ట్) చెంపదెబ్బ కొట్టినట్లు కంగనా రనౌత్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని అవమానించారని దూషిస్తూ తనపై దాడి చేశారని కంగనా రనౌత్‌ తెలిపారు.

అయితే.. కంగనా రనౌత్‌పై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. కంగన రనౌత్ పై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

కాగా.. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటన అనంతరం ఢిల్లీకి చేరుకున్న కంగనా రనౌత్.. సీనియర్ అధికారుల సమక్షంలో, ఆమె ఈ సంఘటన గురించి CISF డైరెక్టర్ జనరల్ నీనా సింగ్‌కు ఫిర్యాదుచేశారు. చండీగఢ్ విమానాశ్రయంలోని కర్టెన్ ఏరియాలో కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తనతో వాదించి చెంపదెబ్బ కొట్టారని కంగనా వివరించారు.

కానిస్టేబుల్ కుల్విందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. సీఓ గదిలో నిర్బంధించి విచారణ కొనసాగిస్తున్నారు. చండీగఢ్ విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజీలను సైతం తనిఖీ చేస్తున్నారు.

కాగా.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందారు.. మండిలో కంగనా రనౌత్ కు 5,37,022 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ కు 4,62,267 ఓట్లు వచ్చాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కారం అనుకోవద్దు.. రుచి చూస్తే మమకారం పెంచుకుంటారు..
కారం అనుకోవద్దు.. రుచి చూస్తే మమకారం పెంచుకుంటారు..
సెల్ఫీ కోసం వెళ్లాడు.. శవంగా తిరిగొచ్చాడు..అలలు ఎంత డేంజరో చూడండి
సెల్ఫీ కోసం వెళ్లాడు.. శవంగా తిరిగొచ్చాడు..అలలు ఎంత డేంజరో చూడండి
అగ్నిపర్వత నీటితో తయారయ్యే Bushmills విస్కీ ఇదీ.. 400 ఏళ్ల చరిత్ర
అగ్నిపర్వత నీటితో తయారయ్యే Bushmills విస్కీ ఇదీ.. 400 ఏళ్ల చరిత్ర
ఇలా చేస్తే వారంలోనే కొత్తిమీర గుబురు, గుబురుగా పెరుగుద్ది..
ఇలా చేస్తే వారంలోనే కొత్తిమీర గుబురు, గుబురుగా పెరుగుద్ది..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు వాతావరణశాఖ అలర్ట్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు వాతావరణశాఖ అలర్ట్
మావయ్య సినిమాకు అల్లుడి క్లాప్‌.. బాలయ్య కొత్త సినిమా ప్రారంభం
మావయ్య సినిమాకు అల్లుడి క్లాప్‌.. బాలయ్య కొత్త సినిమా ప్రారంభం
‘విశ్వంభర’ కోసం రంగంలోకి నాగ్ అశ్విన్..?
‘విశ్వంభర’ కోసం రంగంలోకి నాగ్ అశ్విన్..?
భోజనం తర్వాత చిటికెడు సోంపు.. చిన్న గింజల్లో పెద్ద అద్భుతం
భోజనం తర్వాత చిటికెడు సోంపు.. చిన్న గింజల్లో పెద్ద అద్భుతం
ఇల్లు ఖాళీ చేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వకపోతే చేయాలి..?
ఇల్లు ఖాళీ చేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వకపోతే చేయాలి..?
మారిన ట్రెండ్‌కు తగ్గట్టుగా హీరోల ఖతర్నాక్ లుక్స్..!
మారిన ట్రెండ్‌కు తగ్గట్టుగా హీరోల ఖతర్నాక్ లుక్స్..!