NV Ramana: భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం.. సీజేఐ పీఠం అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తి
భారత 48వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Justice NV Ramana Swearing Ceremony: ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న కార్యాక్రమంలో ఆయన చేత భారత ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం స్వీకారం చేయించారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్ది సంఖ్యలోనే అతిథులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని, పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
ఇక,1957, ఆగస్ట్ 27న జన్మించిన జస్టీస్ ఎన్వీ రమణ పదవీ కాలం 2022, ఆగస్ట్ 26తో ముగియనుంది. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ స్వస్థలం కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరం. 1983లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి జస్టిస్ రమణ.. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. సివిల్, క్రిమినల్ చట్టాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాల్లో దిట్టనే పేరు తెచ్చుకున్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన ఎన్వీ రమణ.. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
తొలుత జస్టిస్ ఎన్వీ రమణ.. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్‌లో నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేరారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత ఎన్వీ రమణనే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌కే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి బాధ్యతలు చేపట్టారు.
Delhi: Justice NV Ramana takes oath as the new Chief Justice of India (CJI). He was administered the oath by President Ram Nath Kovind, at Rashtrapati Bhavan. pic.twitter.com/jDESeLZh2D
— ANI (@ANI) April 24, 2021
ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా పని చేయనున్న కాలంలో 2021 చివరి నాటికి పదవీ విరమణ చేసే వారితో కలిపి 13 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీరితో పాటు వచ్చే ఏడాది మరో నలుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థానాల భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే, హైకోర్టుల్లోనూ పేరుకుపోయిన పెండింగ్ కేసుల విచారణ ముగింపునకు తగినవిధంగా న్యాయమూర్తుల నియామకం చేయడంతో పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Read Also…