ఎంతకూ తెగించార్రా.. ఐస్ క్రీమ్ తిన్నందుకు డబ్బులు అడిగితే కత్తులతో దాడి..!
జార్ఖండ్ రాజధాని రాంచీలోని సుఖ్‌దేవ్ నగర్‌లో దుండగులు రెచ్చిపోయారు. ఒక ఐస్ క్రీమ్ విక్రేతపై దాడికి తెగబడ్డారు. అతనిని కత్తితో పొడిచి దోచుకున్నారు. ఐస్ క్రీమ్ తిన్నందుకు డబ్బులు అడిగిన పాపానికి అతనిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, ఒక నిందితుడిని అరెస్టు చేశారు. మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు.

జార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణం వెలుగు చూసింది. నేరస్థులకు చట్టం అంటే భయం లేకుండాపోయంది. రాంచీలోని సుఖ్‌దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఐస్ క్రీం, మిల్క్ షేక్ అమ్ముతున్న దుకాణదారుడిని దుండగులు బహిరంగంగా దాడి చేసి కత్తులతో పొడిచారు. అంతేకాదు, అతని దగ్గర నుంచి డబ్బులు కూడా దోచుకున్నారు. దీని తరువాత నిందితులందరూ అక్కడి నుండి పారిపోయారు. దుకాణదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు గాయపడిన దుకాణదారుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
రాంచీలోని సుఖ్‌దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడిఖాన్ కుంహర్ టోలి రోడ్డులో ఒక దుకాణదారుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. నిజానికి, ఐస్ క్రీం తిన్న తర్వాత నిందితుల నుండి దుకాణదారుడు డబ్బు అడిగాడు. అందుకు వారు నిరాకరించారు. దుకాణదారుడు డబ్బు డిమాండ్ చేయడంతో దుండగులు కత్తితో మెడపై పదే పదే దాడి చేశారు. కత్తి దాడిలో దుకాణదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు.
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న సుఖ్‌దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన దుకాణదారుడు దిల్‌ఖుష్‌ను చికిత్స కోసం రాంచీ సదర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడు రాజస్థాన్ నివాసి, రాంచీలో నివసిస్తూ ఐస్ క్రీం, మిల్క్ షేక్ అమ్ముతున్నాడు. రాజధాని రాంచీలోని సుఖ్‌దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఈ మొత్తం విషయానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
