Jammu Kashmir: భారత్‌పై దాడికి పాక్‌ యత్నం.. సుపారీ ఉగ్రవాది పట్టివేత.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఆగస్టు 21 తెల్లవారుజామున పాకిస్థాన్ వైపు నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు..

Jammu Kashmir: భారత్‌పై దాడికి పాక్‌ యత్నం.. సుపారీ ఉగ్రవాది పట్టివేత.. షాకింగ్‌ విషయాలు వెల్లడి
Jammu And Kashmir
Follow us
Subhash Goud

|

Updated on: Aug 25, 2022 | 10:39 AM

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఆగస్టు 21 తెల్లవారుజామున పాకిస్థాన్ వైపు నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించినట్లు భారత ఆర్మీ సిబ్బందికి తెలిసింది. ముగ్గురు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సైనికులు సత్వర చర్యలు చేపట్టారు.

కాల్పుల్లో తీవ్రవాదికి గాయాలు

ఇవి కూడా చదవండి

ముగ్గురు టెర్రరిస్టుల్లో ఒకరు భారత పోస్ట్‌కు సమీపంలోకి వచ్చారు. సరిహద్దులో ఉన్న ముళ్ల తీగను కోసేందుకు ప్రయత్నించాడు. సైనికులు అతనిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆర్మీ సిబ్బంది అతనిపై కాల్పులు జరపగా, అతనికి గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకోగలిగారు. గాయపడిన ఉగ్రవాదిని వెంటనే పట్టుకున్నారు. అతనికి ప్రథమ చికిత్స అందించారు.

అరెస్టయిన ఉగ్రవాది పేరు తబారక్ హుస్సేన్. అతను పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేలోని కోట్లి జిల్లాలోని సబ్జ్‌కోట్ గ్రామ నివాసి. సైన్యం అతన్ని విచారించగా, అతను షాకింగ్ విషయాలు వెల్లడించాడు. పాకిస్తాన్‌కు సంబంధించిన విషయాలను బట్టబయలు చేశాడు. భారత పోస్ట్‌పై దాడి చేయడమే తన ప్లాన్ అని చెప్పాడు.

పాకిస్తానీ కల్నల్ దాడి బాధ్యతను అప్పగించినట్లు చెప్పాడు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ యూనస్ చౌదరి తనను పంపాడని ఉగ్రవాది వివరించాడు. ఇందుకోసం కల్నల్ అతనికి 30 వేల పాకిస్థానీ రూపాయలు ఇచ్చాడని, గతంలో కూడా భారత ఆర్మీ ఫార్వర్డ్ పోస్టులపై దాడి చేసేందుకు మరికొందరు ఉగ్రవాదులను గుర్తించినట్లు కూడా అతను అంగీకరించాడు. ఈ ఉగ్రవాదులకు ఆగస్టు 21న పాకిస్థానీ కల్నల్ చౌదరి తరపున భారత పోస్టులపై దాడి చేసే బాధ్యత అప్పగించారు. తబారక్ హుస్సేన్‌ను 2016లో ఇదే స్థలంలో అరెస్టు చేశారు. ఆ సమయంలో అతను తన సోదరుడు హరూన్ అలీతో కలిసి భారతదేశంలోకి చొరబడ్డాడు. అయితే మానవతా ధృక్పథంతో 2017 నవంబర్‌లో అతడిని వదిలి పెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి