AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: వచ్చే నెలలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని మోడీ

షింజో అబే అంత్యక్రియల్లో ప్రధాని మోడీతోపాటు పలు దేశాధినేతలు కూడా పాల్గొననున్నారు. టోక్యోలోని కిటానోమారు నేషనల్ గార్డెన్‌లోని నిప్పన్ బుడోకాన్ అరేనాలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరగనుంది.

PM Narendra Modi: వచ్చే నెలలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని మోడీ
Pm Modi Shinzo Abe
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2022 | 10:41 AM

Share

PM Modi to attend Shinzo Abe’s funeral: వచ్చే నెలలో జరగనున్న జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఈ మేరకు జపాన్ మీడియా బుధవారం వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 27న మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలను (shinzo abe funeral) నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా పలు ఏర్పాట్లను సైతం చేస్తోంది. షింజో అబే అంత్యక్రియల్లో ప్రధాని మోడీతోపాటు పలు దేశాధినేతలు కూడా పాల్గొననున్నారు. టోక్యోలోని కిటానోమారు నేషనల్ గార్డెన్‌లోని నిప్పన్ బుడోకాన్ అరేనాలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. అధికారిక వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని క్యోడో వార్తా సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. జపాన్ భారతదేశానికి కీలకమైన మిత్రదేశాలలో ఒకటి. అయితే, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాతో పాటు సమగ్ర భాగస్వామ్యానికి సంబంధించిన క్వాడ్ ఫార్మాట్‌లో కూడా పాలుపంచుకుంటున్నాయి.

ఈ క్రమంలో మోడీ, అబే భాగ్యస్వామ్య చర్చల తరువాత కాలంలో కూడా ఇరు దేశాలు స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాయి. 2018లో ప్రధాని మోదీ జపాన్‌లో అధికారిక పర్యటన సందర్భంగా.. అబే తన భారతీయ కౌంటర్‌ని యమనాషి ప్రిఫెక్చర్‌లోని తన ఇంటికి ఆహ్వానించారు. దీని తర్వాత ఇద్దరు నాయకుల మధ్య ప్రత్యేకంగా స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడ్డాయి. క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు జపాన్లో పర్యటించిన ప్రధాని మోడీ.. దాదాపు రెండేళ్ల తర్వాత మాజీ ప్రధాని అబేతో సమావేశమయ్యారు.

జపాన్‌లోని నారా నగరంలో ప్రచారం చేస్తుండగా జూలై 8న అబేపై దాడి జరిగింది. దుండగులు వెనుక నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హార్ట్, పల్మనరీ అరెస్ట్‌తో ఒకరోజు తరువాత చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అబే హత్య తర్వాత ప్రధాని మోదీ భారతదేశంలో ఒక రోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. దీంతోపాటు ప్రధాని మోదీ.. మై ఫ్రెండ్, అబే సాన్” పేరుతో ఒక బ్లాగ్ కూడా రాశారు.

ఇవి కూడా చదవండి

“అబే మరణంతో.. జపాన్, ప్రపంచం ఒక గొప్ప దూరదృష్టి గల నేతను కోల్పోయింది. నేను ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను” అంటూ పీఎం మోడీ పేర్కొన్నారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మాజీ ప్రధానమంత్రికి ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండో అధికారిక వీడ్కోలు కార్యక్రమం ఇదే.. మొదటిగా 1967లో షిగేరు యోషిదాకు నిర్వహించారు. ఈ ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తరుపున జపాన్‌కు సేవలందించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..