రూట్‌ మార్చిన జైషే.. భారత్‌పై దాడికి మరో వేదికగా స్కెచ్‌..!

రూట్‌ మార్చిన జైషే.. భారత్‌పై దాడికి మరో వేదికగా స్కెచ్‌..!

పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ తన రూట్ మార్చింది. నిత్యం పాక్ వేదికగా భారత్‌లో దాడులకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే జైషే కుట్రల్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. దీంతో మరో వేదికగా భారత్‌పై కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. భారత్‌లో అలజడి సృష్టించేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ వేదికగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆఫ్ఘన్‌లోని తాలిబాన్‌ ఉగ్ర శిభిరాల్లో నలుగు వందల మంది జైషే ఉగ్రవాదుల్ని మోహరించింది. వీరందర్నీ భారత్‌లోని కశ్మీర్‌ లోయకు పంపేందుకు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 06, 2020 | 6:36 PM

పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ తన రూట్ మార్చింది. నిత్యం పాక్ వేదికగా భారత్‌లో దాడులకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే జైషే కుట్రల్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. దీంతో మరో వేదికగా భారత్‌పై కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. భారత్‌లో అలజడి సృష్టించేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ వేదికగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆఫ్ఘన్‌లోని తాలిబాన్‌ ఉగ్ర శిభిరాల్లో నలుగు వందల మంది జైషే ఉగ్రవాదుల్ని మోహరించింది. వీరందర్నీ భారత్‌లోని కశ్మీర్‌ లోయకు పంపేందుకు పక్కా స్కెచ్‌ వేస్తున్నట్లు ఆఫ్ఘన్‌ భద్రతా బలగాలు పసిగట్టాయి. గత నెలలో జరిగిన ఓ ఉగ్రదాడిలో పాక్‌కు చెందిన పలువురు ఉగ్రవాదుల్ని ఆఫ్ఘన్ భద్రతా బలగాలు పట్టుకున్నాయి. వారిని విచారించగా.. పాక్‌లో శిక్షణ పొందుతున్నట్లు అప్పట్లోనే వారంతా వెల్లడించినట్లు ఆఫ్ఘన్ అధికారులు వెల్లడించారు.

ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా.. గత ఏప్రిల్‌ నెల 12వ తేదీన ఓ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఓ ఉగ్రశిభిరంలో జరుగుతున్న కార్యకలాపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ శిభిరంలో పలువురు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ఖోస్థ నుంచి జలాలాబాద్‌ వరకూ విస్తరించిన ప్రాంతాలతో పాటు.. కాందాహార్ ప్రావిన్స్‌లోని పాక్‌ సరిహద్దుల్లో.. తాలిబన్‌ యూనిట్లలో జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల్ని ఉంచారని.. కాబూల్‌కి చెందిన ఓ అధికారి వెల్లడించారు. వీరంతా పాక్‌ మీదుగా భారత్‌లోకి చొరబడి దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి నిత్యం ఉగ్రవాదులు దేశంలో చొరబడేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏప్రిల్‌ నుంచి నేటి వరకు దాదాపు ముప్పై మంది ఉగ్రవాదుల్ని భారత జవాన్లు హతమార్చారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu