టీచర్ నుంచి టెర్రరిస్టుగా మారిన రియాజ్ నైకూ !
కాశ్మీర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్ బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకూ.. బుధవారం ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించాడు. పుల్వామా జిల్లా బేగ్ పురా ప్రాంతంలో జరిగింది ఈ ఎన్ కౌంటర్.. నైకూ అలియాస్ మహమ్మద్ బిన్ కాసిం అనే ఈ ఉగ్రవాదికి 11 టెర్రరిస్ట్ కేసులతో ప్రమేయం ఉంది. ఇతని తలపై 12 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. టాప్ హిజ్ బుల్ కమాండర్ బుర్హాన్ వనికి […]

కాశ్మీర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, హిజ్ బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకూ.. బుధవారం ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించాడు. పుల్వామా జిల్లా బేగ్ పురా ప్రాంతంలో జరిగింది ఈ ఎన్ కౌంటర్.. నైకూ అలియాస్ మహమ్మద్ బిన్ కాసిం అనే ఈ ఉగ్రవాదికి 11 టెర్రరిస్ట్ కేసులతో ప్రమేయం ఉంది. ఇతని తలపై 12 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. టాప్ హిజ్ బుల్ కమాండర్ బుర్హాన్ వనికి ఇతగాడు సన్నిహిత సహచరుడు కూడానట. (2016 జులైలో బుర్హాన్ వని కూడా ఎన్ కౌంటర్ లో చనిపోయాడు).
32 ఏళ్ళ రియాజ్ నైకూ లైఫ్ హిస్టరీ విచిత్రంగా ఉంది. సౌత్ కాశ్మీర్ లో పుట్టిన ఇతడు పుల్వామా జిల్లాలోని ఓ కాలేజీలో చదివి గ్రాడ్యుయేట్ అయ్యాడు. 2010-12 మధ్య కాలంలో ఓ స్కూల్లో టీచర్ గా పని చేశాడు. తరచూ ఇస్లామిక్ విషయాల మీద ప్రసంగాలు చేసేవాడు. అయితే 2012 లో ఇతని జాడ కనబడకుండా పోయింది. బహుశా అప్పటికే ఉగ్రవాదం వైపు మళ్ళిఉంటాడు. యాసిన్ ఇట్టూ అనే కరడు గట్టిన టెర్రరిస్ట్ 2017 లో ఓ ఎన్ కౌంటర్ లో మరణించాక అతని స్థానే రియాజ్ ‘హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ కాశ్మీర్’ అయ్యాడు. అంటే కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించేవాడట. రియాజ్ టెక్ సేవీ కూడా అని, ఫెసిలిటేటర్ గా, మోటివేటర్ గా వ్యవహరించేవాడని తెలిసింది. యూత్ ని ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకునేవాడట. కాశ్మీర్ పోలీసు అధికారులను బెదిరించడం, వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం వంటి నేరారోపణలు ఇతనిపై ఉన్నాయి. రెండేళ్ల క్రితం… 2018 లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కళ్ళలో యాసిడ్ పోయాలని ఇతనికి, మరో ఇద్దరు ఉగ్రవాదులకు మధ్య జరిగిన సంభాషణ తాలూకు ఆడియో టేప్ ఒకటి నాడు బయటపడింది. ఇంతటి ఘోర ఉగ్రవాది ఎన్ కౌంటర్ లో మరణించడం నిజంగా భారత దళాల ‘విజయమే’నని చెప్పాలి.



