Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT raids : ప్రఖ్యాత నగల దుకాణంలో ఐటీ సోదాలు.. కోట్లలో నగదు, ఆస్తులు సీజ్..!

సమాచారం ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ ఈ ఆపరేషన్ కోసం ఐటీ శాఖ పలు బృందాలుగా దాడులు నిర్వహించింది. ఇందులో నగల వ్యాపారి కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు జరిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, పన్ను వ్యత్యాసాల గురించి శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

IT raids : ప్రఖ్యాత నగల దుకాణంలో ఐటీ సోదాలు.. కోట్లలో నగదు, ఆస్తులు సీజ్..!
Cash Seazed
Jyothi Gadda
|

Updated on: May 26, 2024 | 6:03 PM

Share

IT raids : మహారాష్ట్రలోని నాసిక్‌లో నగల వ్యాపారిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని సమాచారంతో ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సుమారు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని సంపదకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నాసిక్‌లోని సురనా జ్యుయెలరీలో ఈ సోదాలు జరిగాయి.

సమాచారం ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ ఈ ఆపరేషన్ కోసం ఐటీ శాఖ పలు బృందాలుగా దాడులు నిర్వహించింది. ఇందులో నగల వ్యాపారి కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు జరిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, పన్ను వ్యత్యాసాల గురించి శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఇవి కూడా చదవండి

ఈ పరిణామం నాసిక్ వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. సురానా జ్యువెలర్స్ నగరంలో ఒక ప్రసిద్ధ వ్యాపార సంస్థ. ఆదాయపు పన్ను శాఖ దాడులు, స్వాధీనం చేసుకున్న ఆస్తులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..