Skin Care Tips: పచ్చి పాలలో వీటిని మిక్స్ చేసి అప్లై చేయండి.. మెరిసే చర్మం మీ సొంతం

లోషన్‌కు బదులుగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించండి. ఎండలోకి వెళ్లే ముందు అధిక SPF 40 ఉన్న సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి. మేకప్ సమయంలో చర్మాన్ని ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్‌గా ఉంచండి. ఇందుకోసం తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి.

Skin Care Tips: పచ్చి పాలలో వీటిని మిక్స్ చేసి అప్లై చేయండి.. మెరిసే చర్మం మీ సొంతం
Rose Water Face Pack
Follow us
Jyothi Gadda

|

Updated on: May 26, 2024 | 5:41 PM

వేసవిలోనూ చాలా మందికి చేతులు, కాళ్ళు, పెదవులు, ముఖం చర్మం పగుళ్లు ఏర్పాడుతుంటాయి. కొందరికి ఈ సమస్య చాలా తీవ్రంగా మారుతుంది. అటువంటి చర్మంపై మీరు ఎంత మాయిశ్చరైజర్‌ను అప్లై చేసినా దాని ప్రభావం ఉండదు. సమస్య పెరుగుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యమైన విషయం. చర్మం పగుళ్లు, సన్‌బర్న్‌ మరకలు, మచ్చలను శుభ్రం చేయడానికి పచ్చి పాలు అత్యంత ఉపయోగకరంగా పరిగణించబడతాయి. దీనికోసం పాలలో ముంచిన మెత్తని కాటన్ ప్యాడ్ తీసుకోండి. పచ్చి పాలను క్లెన్సర్‌గా మార్చడానికి, మీరు దానికి కొంచెం కాఫీ పౌడర్, సముద్రపు ఉప్పును కూడా కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌ను రెండు చేతులతో తీసుకుని వృత్తాకారంలో ముఖంపై కాసేపు స్మూత్‌గా మర్ధన చేయాలి. ఎక్కువ ఒత్తడి లేకుండా, తేలికగా రబ్ చేసుకోవాలి. కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో వాష్‌ చేసుకోవాలి. ఇలా చేస్తే మీరు త్వరలోనే మంచి మార్పును గమనిస్తారు.

కందిపోయిన ముఖానికి తిరిగి నిగారింపు కోసం..

గ్లిజరిన్, నిమ్మకాయ: గ్లిజరిన్, నిమ్మకాయ మిశ్రమాన్ని తయారు చేసి ఒక సీసాలో ఉంచుకోండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి, శరీరానికి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనె: మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నూనె కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాస్తవానికి, కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన కొవ్వు, తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కాకుండా, ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ కూడా. ఇది చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడి చర్మం సమస్యను తగ్గిస్తుంది.

అలోవెరా క్రీమ్ లేదా జెల్ ఉపయోగించండి . అలోవెరా ఉత్తమ మాయిశ్చరైజర్. యాంటీఆక్సిడెంట్. లోషన్‌కు బదులుగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించండి. ఎండలోకి వెళ్లే ముందు అధిక SPF 40 ఉన్న సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి. మేకప్ సమయంలో చర్మాన్ని ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్‌గా ఉంచండి. ఇందుకోసం తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..