Sadhguru – Duologue With Barun Das: ‘డ్యుయోలాగ్ విత్ బరుణ్ దాస్’.. సనాతన జీవన విధానంపై సద్గురు చెప్పిన విషయాలేమిటీ?
ప్రముఖ యోగి, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆధ్యాత్మిక చింతనతో అన్నింటిని జయించవచ్చంటూ సద్గురు తరచూ బోధిస్తుంటారు.
ప్రముఖ యోగి, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆధ్యాత్మిక చింతనతో అన్నింటిని జయించవచ్చంటూ సద్గురు తరచూ బోధిస్తుంటారు. జ్ఞానం, ఆధ్యాత్మిక వికాసంతో సనాతన జీవన విధానం మన సంప్రదాయమని పేర్కొంటారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోవడం సన్యాసం స్వీకరించడమే మార్గమన్న అభిప్రాయం కొందరిలో ఉంటుంది. కానీ అది తప్పని.. ఆధ్యాత్మిక భావంతో అన్ని రంగాల్లోనూ మనం రాణించే అవకాశం ఉందని పేర్కొంటారు సద్గురు.. ఈ క్రమంలోనే TV9 నెట్‌వర్క్ ఎండీ అండ్ సీఈవో బరున్‌దాస్ డ్యుయోలాగ్ (Duologue with Barun Das) కు హాజరైన సద్గురు పలు ఆధ్యాత్మిక వికాసానికి సంబంధించిన విషయాలతోపాటు.. ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. బరున్ దాస్ అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి సమాధానాలను ఇచ్చారు. మొత్తం ఆరు ఎపిసోడ్ల ఈ ఇంటర్వ్యూలో సద్గురు ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక గురువుల విధానాలు, ఆదియోగి శివ సూత్రలు- విశ్వాసం, అంచనాలు – ఆనందం, ‘సనాతన’ జీవన విధానం – భారతదేశ ఆర్థిక విధానం – సరిదిద్దలేని చారిత్రాత్మక తప్పిదాలు, యువత – కుటుంబ, ఆధ్యాత్మిక విలువలు గురించి బరున్ దాస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆధ్యాత్మికత అనేది ఒక ‘భావన’ అనే దానిని సద్గురు ఏకీభవించలేదు.. దీనికి సంబంధించి బరున్ దాస్ అడిగిన ప్రశ్నలకు ఆయన ఏమని సమాధానం ఇచ్చారు.. అనేది ప్రోమోలో చూపించారు. దీంతోపాటు సనాతన జీవన విధానం.. ఆధ్యాత్మిక చింతన లాంటి అంశాలు.. సంతోషం, భారత సంప్రదాయం.. లాంటి విషయాలను కూడా సద్గురు పంచుకున్నారు.
ఆధ్యాత్మికంగా ఎలాంటి మానసిక స్థితి కలిగి ఉంటే.. జీవితంలో రాణించవచ్చు.. కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు ఎలాంటి మెళకువలను అలవర్చుకోవాలి.. లాంటి విషయాలను సద్గురు బరున్ దాస్ కు వివరించారు.
డ్యుయోలాగ్ విత్ బరున్ దాస్.. సద్గురు ఆరు ఎపిసోడ్లను వీక్షించడానికి న్యూస్ 9 యాప్ ను మీ మొబైల్ లో డౌన్లౌడ్ చేసుకోండి.. లేదా యూట్యూబ్ లో వీక్షించవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..