Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwagandha: ఢిల్లీలో ప్రపంచ అశ్వగంధ మండలి.. 10 దేశాల ప్రతినిధులు హాజరు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..

దేశ రాజధాని ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో ప్రపంచ అశ్వగంధ మండలి కోసం శుక్రవారం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొని అశ్వగంధ ప్రయోజనాలు..

Ashwagandha: ఢిల్లీలో ప్రపంచ అశ్వగంధ మండలి.. 10 దేశాల ప్రతినిధులు హాజరు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే..
Union Minister Kailash Chaudhary
Follow us
Subhash Goud

|

Updated on: Feb 18, 2023 | 5:03 PM

దేశ రాజధాని ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో ప్రపంచ అశ్వగంధ మండలి కోసం శుక్రవారం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొని అశ్వగంధ ప్రయోజనాలు, ప్రపంచవ్యాప్తంగా ఎలా చేరుకోవాలనే దాని గురించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మనమంతా సరైన పోషకాలున్న ఆహారం తీసుకోకుండా జంక్‌ ఫుడ్‌, ఇతర అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు, ఇతర పానియాలను తీసుకుంటున్నామని అన్నారు.

ఈ రోజు మన ఆరోగ్యాన్ని కాపాడే పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎపిసోడ్‌లో అశ్వగంధను ప్రమోట్ చేస్తున్నాము. ఈ మిషన్‌లో మాతో పాటు దేశ, విదేశాల నుంచి చాలా మంది వస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గిరీష్ త్యాగి అశ్వగంధ ప్రయోజనాలు, దాని భవిష్యత్తు గురించి మాట్లాడారు. 5000 ఏళ్లనాటి అశ్వగంధ ఎంత మేలు చేస్తుందో చెప్పాల్సిన అవసరముందన్నారు. దీంతో వ్యవసాయ రంగంలోనూ విప్లవం తీసుకురాగలమని అన్నారు. నేడు అశ్వగంధ చాలా మంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అశ్వగంధ, ఆయుర్వేద ప్రయోజనాల గురించి ప్రజలకు చెప్పారు.

అశ్వగంధ ప్రయోజనాలు:

అశ్వగంధ అనేది ఒత్తిడి, అలసట, నొప్పి, మంట, జుట్టు రాలడం, చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగపడే మూలిక. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. దీని కారణంగా ఇది చాలా సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఉపయోగించడం జరుగుతోంది. అంతే కాకుండా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నా అశ్వగంధ సేవించవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎవరికైనా కీళ్ల నొప్పులు, వాపు సమస్య, లేచి కూర్చోవడంలో ఇబ్బంది ఉంటే అశ్వగంధ సహాయంతో ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి