వీర సావర్కర్‌కు “భారత రత్న”.. కేంద్రం ఏం అంటోంది..?

గత కొద్ది రోజులుగా స్వాతంత్య్ర  సమరయోధుడు వీర సావర్కర్‌కు.. “భారత రత్న” అవార్డు ఇవ్వాలంటూ వస్తున్న డిమాండ్‌ గురించి తెలిసిందే. అయితే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వెలువడటంతో.. దీనిపై సస్పెన్స్ నెలకొంది. దీంతో కేంద్రం త్వరలో ఈ సస్పెన్స్‌కు చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో “వీర సావర్కర్‌కు భారత రత్న” అంశంపై బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి స్పందించారు. సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని.. ఎవరూ సిఫారసు […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:14 pm, Tue, 19 November 19
వీర సావర్కర్‌కు "భారత రత్న".. కేంద్రం ఏం అంటోంది..?

గత కొద్ది రోజులుగా స్వాతంత్య్ర  సమరయోధుడు వీర సావర్కర్‌కు.. “భారత రత్న” అవార్డు ఇవ్వాలంటూ వస్తున్న డిమాండ్‌ గురించి తెలిసిందే. అయితే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వెలువడటంతో.. దీనిపై సస్పెన్స్ నెలకొంది. దీంతో కేంద్రం త్వరలో ఈ సస్పెన్స్‌కు చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో “వీర సావర్కర్‌కు భారత రత్న” అంశంపై బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి స్పందించారు. సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని.. ఎవరూ సిఫారసు చేయాల్సిన అవసరం లేదన్నారు. దీంతో త్వరలో సావర్కర్‌కు భారత రత్న ఇవ్వబోతున్నట్లు పరోక్షంగా చెప్పకనే చెప్పింది. అయితే ఎప్పుడు ఇస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు

కాగా, వీర సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో వినిపించింది. అంతేకాదు ఇదే అంశాన్ని ఏకంగా బీజేపీ తాను విడుదల చేసిన మానిఫెస్టోలో కూడా పెట్టింది. అధికారంలోకి వస్తే.. వీర్ సావర్కర్‌కు “భారత రత్న” వచ్చేలా కృషి చేస్తామంటూ అందులో పేర్కొంది. అయితే దీన్నీ ఎంఐఎం పార్టీ వ్యతిరేకించింది.