మహా పాలిటిక్స్‌పై.. ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

మహారాష్ట్ర రాజకీయాలు.. రోజుకో మలుపుతిరుగుతున్న విషయం తెలిసిందే. అసలు ఇక్కడ ఏ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరువురి మధ్య సీఎం సీటు విషయంలో వచ్చిన విభేదాలతో.. విడిపోయారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనైనా సీఎం పదవి దక్కించుకోవాలనుకుంటున్న శివసేన.. మిత్రపక్షమైన బీజేపీకి గుడ్‌బై చెప్పి.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ రెండు పార్టీలు.. శివసేనతో […]

మహా పాలిటిక్స్‌పై.. ఆరెస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
Follow us

| Edited By:

Updated on: Nov 19, 2019 | 7:20 PM

మహారాష్ట్ర రాజకీయాలు.. రోజుకో మలుపుతిరుగుతున్న విషయం తెలిసిందే. అసలు ఇక్కడ ఏ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్నది పెద్ద మిస్టరీగా మారింది. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరువురి మధ్య సీఎం సీటు విషయంలో వచ్చిన విభేదాలతో.. విడిపోయారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనైనా సీఎం పదవి దక్కించుకోవాలనుకుంటున్న శివసేన.. మిత్రపక్షమైన బీజేపీకి గుడ్‌బై చెప్పి.. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ రెండు పార్టీలు.. శివసేనతో జతకట్టే అంశంపై ఇంకా క్లారిటీకి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన మధ్య చోటుచేసుకున్న రగడపై ఆర్ఎస్సెస్ ఎంటర్ అయ్యింది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య చెలరేగిన చిచ్చును ఉద్దేశిస్తూ.. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో సుదీర్ఘకాలంగా పరస్పర అనుబంధంతో సాగిన ఈ రెండు పార్టీలు.. ఏ విషయంపై గొడవకు దిగినా.. అది రెండు పార్టీలకు నష్టమేనన్నారు. స్వార్ధం అనేది మంచిది కాదన్న విషయం ప్రతిఒక్కరికీ తెలుసని.. కానీ కొద్ది మంది మాత్రమే ఆ స్వార్ధాన్ని విడనాడతారని.. అప్పుడే వాళ్లు సక్సెస్ అవుతారన్నారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. పదవుల పంపకంపై ఇరువురు తగవులాడితే.. మంచిది కాదన్న ఆయన.. ఘర్షణలకు దిగితే ఇరుపార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

కాగా, రాష్ట్రంలో గడువు ముగిసేలోగా అధికారం చేపట్టేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో.. గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర హోం శాఖకు  సిఫారసు చేయడం.. ఆ తర్వాత కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.

వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
నిత్యం కడుపు ఉబ్బరంగా ఉంటుందా.? ఇదే కారణం..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
ఎట్టకేలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి..
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు
10th ఫలితాల్లో 93.5% మార్కులు..సంతోషం పట్టలేక స్పృహ తప్పిన బాలుడు