AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే జాగిలం..ఫుట్‌బోర్డింగ్‌ చేశారో పనిపడుతుంది..!

బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పడు..చాలా మంది ఫుట్‌బోర్డింగ్‌ చేస్తుంటారు..లోపల ఖాళీగా ఉన్నప్పటికీ మెట్లపైనే నిల్చుని ప్రయాణిస్తుంటారు. అధికారులు, స్థానికులు ఎంత చెప్పినా వారు తమ తీరు మార్చుకోరు సరికదా..చాలా సార్లు చాల మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. కొన్ని సార్లు పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించటంతో అందరూ దానిని లైట్‌గా తీసుకుంటున్నారు. కానీ, అక్కడ మాత్రం రైళ్లో ఫుట్‌బోర్డింగ్‌ చేస్తామంటే..ఆ కుక్క మీమల్ని వదిలిపెట్టదు. లోపలికి వెళ్లే వరకు వెంటాడుతుంది. ఆ రైల్వే జాగిలానికి సంబంధించిన వీడియో […]

రైల్వే జాగిలం..ఫుట్‌బోర్డింగ్‌ చేశారో పనిపడుతుంది..!
Pardhasaradhi Peri
|

Updated on: Nov 19, 2019 | 7:31 PM

Share

బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పడు..చాలా మంది ఫుట్‌బోర్డింగ్‌ చేస్తుంటారు..లోపల ఖాళీగా ఉన్నప్పటికీ మెట్లపైనే నిల్చుని ప్రయాణిస్తుంటారు. అధికారులు, స్థానికులు ఎంత చెప్పినా వారు తమ తీరు మార్చుకోరు సరికదా..చాలా సార్లు చాల మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. కొన్ని సార్లు పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించటంతో అందరూ దానిని లైట్‌గా తీసుకుంటున్నారు. కానీ, అక్కడ మాత్రం రైళ్లో ఫుట్‌బోర్డింగ్‌ చేస్తామంటే..ఆ కుక్క మీమల్ని వదిలిపెట్టదు. లోపలికి వెళ్లే వరకు వెంటాడుతుంది. ఆ రైల్వే జాగిలానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొడుతోంది. చెన్నైలోని పార్క్‌టౌన్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్న ఆ కుక్క పేరు చిన్నపొన్ను. కొన్ని రోజుల క్రితం అది రైల్వే స్టేషన్‌లో కనిపించిందట. చిన్నపొన్ను యజమాని ఇంట్లో దాని గోల భరించలేక స్టేషన్లో వదిలేసి పోయాడట. దానిని చూసిన రైల్వే పోలీసు శాఖ సభ్యులు కొందరు చిన్నపొన్నును పెంచుకుంటున్నారు. వారితో పాటుగానే దానిని కూడా డ్యూటీకి తీసుకువెళ్లడం ప్రారంభించారు. అలా అది వారు చేస్తున్న డ్యూటీని అర్థం చేసుకుంది..విశ్వాసంతో ఆర్‌పీఎఫ్‌ దళంతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. రైళ్లలో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నా, రన్నింగ్‌ రైలు ఎక్కినా, దిగినా, ఫ్లాట్‌ఫాం మారేందుకు పట్టాలు దాటుతున్న ప్రయాణికులను హెచ్చరిస్తుంది. అధికారులు కొన్ని సార్లు చూసి చూడనట్టుగా వదిలేసినా ఆ కుక్క మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టదు. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉందట..ఎవరై అనుమానాస్పద వ్యక్తులు, దొంగలు తనకంట పడితే చాలు వెంటనే వారిని పసిగట్టేస్తుందట. దీంతో అధికారులకు తమ డ్యూటీ చాలా సులభం అయిపోయిందని చెబుతున్నారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా