AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఏ దిశలో ఉంచాలో తెలుసా?

Vastu Tips for Home Plants: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను సరైన దిశలో పెంచడం వల్ల సానుకూల శక్తి, సంపద, ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం. తులసి, మనీ ప్లాంట్, లక్కీ బాంబూతో పాటు ఏ మొక్కను ఏ దిశలో ఉంచాలో తెలుసుకోండి.

Vastu Tips: లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఏ దిశలో ఉంచాలో తెలుసా?
Vastu Tips For Home Plants
Rajashekher G
|

Updated on: Aug 13, 2026 | 2:19 PM

Share

Home Plant Vastu Tips Telugu: ఇంట్లో పచ్చని మొక్కలు పెంచుకోవడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా, సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో సరైన దిశలో ఉంచి సంరక్షించడం వల్ల సంపద, ఆరోగ్యం, ప్రశాంతత, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే మొక్కలను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం కాకుండా.. వాస్తు ప్రకారం వాటికి అనుకూలమైన దిశలను ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

లక్ష్మీదేవి అనుగ్రహానికి తులసి

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా భావించే తులసిని ఇంటి ఈశాన్యం, ఉత్తరం లేదా తూర్పు దిశల్లో పెంచడం శుభప్రదమని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి. తులసి ఇంట్లో సానుకూల ప్రకంపనలు పెంచడంతో పాటు ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని విశ్వాసం.

ఆర్థిక స్థిరత్వానికి మనీ ప్లాంట్

మనీ ప్లాంట్‌ను సంపద, ఆర్థిక శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇది శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. అందువల్ల మనీ ప్లాంట్‌ను ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత అనుకూలమని చెబుతారు. ప్రత్యామ్నాయంగా ఉత్తర దిశలో కూడా ఉంచవచ్చు. మొక్క ఆరోగ్యంగా, పచ్చగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విజయం, శ్రేయస్సు కోసం లక్కీ బాంబూ

లక్కీ బాంబూ మొక్కను అదృష్టం, అభివృద్ధి, విజయానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా 6 లేదా 8 కాండాలు ఉన్న లక్కీ బాంబూను హాలులో, రిసెప్షన్ ప్రాంతంలో లేదా ఆఫీస్ టేబుల్‌పై ఉంచడం శుభప్రదమని నమ్మకం. దీనిని తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచడం వల్ల కుటుంబంలో అభివృద్ధి, శ్రేయస్సు, విజయానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని వాస్తు విశ్వాసం.

మనశ్శాంతి కోసం కలబంద, శంఖపుష్పి

ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం కలబంద (అలోవెరా), శంఖపుష్పి వంటి మొక్కలను పెంచుకోవచ్చని వాస్తు సూచనలు చెబుతున్నాయి. వీటిని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం అనుకూలమని భావిస్తారు. ఈ మొక్కలు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడంలో సహాయపడతాయని నమ్మకం.

ఆరోగ్యం, స్వచ్ఛమైన వాతావరణం కోసం వేప, ఉసిరి

వేప, ఉసిరి చెట్లకు భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇంటికి తగినంత స్థలం ఉంటే దక్షిణం లేదా పడమర వైపు ఉన్న తోట ప్రాంతంలో వీటిని పెంచుకోవచ్చని కొన్ని వాస్తు సూచనలు చెబుతున్నాయి. వేప, ఉసిరి చెట్లు పర్యావరణపరంగా కూడా ఉపయోగకరమైనవే. ఇవి పచ్చదనాన్ని పెంచడంతో పాటు ఇంటి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచడంలో సహాయపడతాయి.

మొత్తంగా, వాస్తు ప్రకారం మొక్కలను సరైన దిశలో ఉంచడం ఇంట్లో సానుకూల వాతావరణం, ప్రశాంతత, శ్రేయస్సును పెంచుతుందని నమ్మకం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ప్రధానంగా వాస్తు, సంప్రదాయ విశ్వాసాల ఆధారిత సూచనలు మాత్రమే. ఆరోగ్యం లేదా ఆర్థిక ప్రయోజనాలకు శాస్త్రీయ హామీగా పరిగణించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us