Operation Sindhu: ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల నుంచి భారతీయుల తరలింపు.. ఎంతమంది వచ్చారంటే..
ఇప్పటికే ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం స్వదేశానికి వెళ్ళే భారత పౌరులకు రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్‌లో యుద్ధ వాతావరణం కారణంగా రెండు దేశాల్లోని భారతీయ పౌరులను అప్రమత్తంగా ఉండాలని భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇరు దేశాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు.

ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం 10 రోజులుగా కొనసాగుతుంది.. ఇరు దేశాల్లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సింధును చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.. ఇరాన్ లో పదివేల మంది భారతీయులు ఉండగా ఇప్పటివరకు నాలుగు విమానాల్లో 827 మంది ఇరాన్ నుంచి భారత్ చేరుకున్నారు..ఇరాన్ సరిహద్దు ల నుంచి ఆర్మేనియా మీదుగా మొదట భారత్ రాగా తదుపరి ఎయిర్ స్పేస్ తెరిచి నేరుగా ఇరాన్ మషాద్ నుంచి మహాన్ విమానయాన సంస్థ ద్వారా భారత పౌరుల తరలింపు కొనసాగుతుంది.. ఇక ఇజ్రాయిల్ నుంచి సైతం భారతీయుల తరలింపు ప్రారంభం కానుంది … ఇజ్రాయెల్ లో 25000- 28000 వేల మంది భారతీయులు ఉన్నారు..పనివాళ్లుగా,నిర్మాణ కార్మికులుగా ఇజ్రాయెల్ లో ఉంటున్న వారంతా తిరిగి స్వదేశానికి రానున్నారు
ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్ , ఈజిప్ట్ దేశాల మీదుగా భారత పౌరుల తరలింపు
ఇజ్రాయెల్ నుండి ఆదివారం అమ్మన్ నుండి భారతీయుల తరలింపు కోసం విమానాలు ప్రారంభం కానున్నాయి. ఇజ్రాయెల్ సరిహద్దు పాయింట్ల నుంచి భారతీయులను ఆదివారం రోడ్డు మార్గంలో జోర్డాన్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి ముంబై ,ఢిల్లీకి రానున్నారు భారతీయులు..ఇప్పటికే జోర్డాన్ అమ్మాన్ విమానాశ్రయం నుంచి ముంబై కి50 మంది భారతీయులు వచ్చారు..పశ్చిమాసియా సంక్షోభం పెరుగుతున్న కొద్దీ ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరుల తరలింపుకు జోర్డాన్ ,ఈజిప్ట్ దేశాలు భారత్ కు మద్దతు ప్రకటించాయి. ఇజ్రాయెల్ నుండి భారత పౌరుల తరలింపు కోసం తమ దేశం సహాయం చేస్తోందని జోర్డాన్ రాయబారి యూసుఫ్ అబ్దుల్ఘాని పేర్కొన్నారు..
భారతీయ పౌరులందరినీ సురక్షితంగా భారతదేశానికి పంపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.. రాయల్ జోర్డాన్ ఎయిర్‌లైన్స్ ద్వారా ఇజ్రాయిల్ లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి వస్తున్నారు..రాయల్ జోర్డాన్ ఎయిర్‌లైన్స్ ఇటీవల ముంబైకి వారానికి 4 విమానాలను ప్రారంభించింది. ఈ వారం ప్రారంభంలో భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ నుండి బయలుదేరాలనుకునే పౌరులను తరలించాలని నిర్ణయించింది..మొదట ఇజ్రాయిల్ నుంచి భూమార్గ సరిహద్దుల ద్వారా జోర్డాన్, ఈజిప్ట్ కి భారత పౌరుల తరలింపు జరుగుతుంది.. అనంతరం జోర్డాన్, ఈజిప్ట్ నుంచి విమానాల్లో భారత పౌరులను ఢిల్లీ, ముంబై తరలించనున్నారు..
#OperationSindhu gains momentum.
290 Indian nationals have returned home safely from Iran on a special flight from Mashhad that landed in New Delhi at 2330 hrs on 21 June 2025.
With this, 1,117 Indian nationals have been evacuated from Iran. pic.twitter.com/FScyeKslzw
— Randhir Jaiswal (@MEAIndia) June 21, 2025
ఇప్పటికే ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం స్వదేశానికి వెళ్ళే భారత పౌరులకు రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది. టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. +972 54-7520711; +972 54-3278392 హెల్ప్‌లైన్ నంబర్లు, cons1.telaviv@mea.gov.in ఈమెయిల్ ద్వారా ఇజ్రాయిల్ లోని భారతీయులు తమ వివరాలను రాయబార కార్యాలయానికి తెలియజేయవచ్చు ..ఇజ్రాయెల్, ఇరాన్‌లో యుద్ధ వాతావరణం కారణంగా రెండు దేశాల్లోని భారతీయ పౌరులను అప్రమత్తంగా ఉండాలని భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇరు దేశాల్లోని భారత రాయబార కార్యాలయ అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




