AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: జీ20 సదస్సు నిర్వహణపై అఖిలక్ష సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం.. మోదీతో చంద్రబాబు నాయుడు ముచ్చట్లు..

భారత్‌ లో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి,,

G20 Summit: జీ20 సదస్సు నిర్వహణపై అఖిలక్ష సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం.. మోదీతో చంద్రబాబు నాయుడు ముచ్చట్లు..
Modi, Chandra Babu Naidu
Amarnadh Daneti
|

Updated on: Dec 05, 2022 | 9:21 PM

Share

భారత్‌ లో జీ20 సదస్సు నిర్వహణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు.. వివిధ పార్టీల అధ్యక్షులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి వచ్చిన నాయకులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్యాయంగా పలకరించారు. ఇదే సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంద్రబాబు నాయుడు కలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీనీ అధినేతలను ఆప్యాయంగా పలకరించిన మోదీ.. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా రాజకీయాంశాలపై ఏవైనా మాట్లాడారా అనే అంశాలపై ఎటువంటి స్పష్టత రాలేదు. మోదీ, చంద్రబాబునాయుడుల సమావేశం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణమాం చోటు చేసుకుంది. జీ20 సదస్సు నిర్వహణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకున్నారు.

జీ-20 సమావేశానికి సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు కావల్సిందిగా అన్ని పార్టీల అధినేతలకు కేంద్రప్రభుత్వం ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

ఈ సమావేశం సందర్భంగా భారత్‌ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. జీ-20 సమావేశాల విజయవంతానికి సహకరించాలని ప్రధాని మోదీ కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..