J. P. Nadda: తెలంగాణపై బీజేపీ స్ట్రాంగ్ ఫోకస్.. ఈ నెల 16న కరీంనగర్ కు జేపీ నడ్డా..

తెలంగాణ రాజకీయ పరిస్థితులు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వం విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు..

J. P. Nadda: తెలంగాణపై బీజేపీ స్ట్రాంగ్ ఫోకస్.. ఈ నెల 16న కరీంనగర్ కు జేపీ నడ్డా..
Jp Nadda
Follow us

|

Updated on: Dec 05, 2022 | 9:02 PM

తెలంగాణ రాజకీయ పరిస్థితులు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వం విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తన ఉనికి కోసం గట్టిగానే పోరాడుతోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముగియడంతో బీజేపీ కేడర్ తెలంగాణపై ఫోకస్ పెట్టిందని గతంలో వచ్చాయి. అయితే ఇప్పుడు వాటిని నిజం చేసేలా పార్టీ ముఖ్య నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 16న కరీనంగర్ వస్తున్నారని పార్టీ శ్రేణులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 16 తో ముగియనున్నది. ఇందులో భాగంగా కరీంనగర్​లో భారీ బహిరంగ సభకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇందులో పాల్గొంటారని ముఖ్యనేతలు పేర్కొన్నారు.

కాగా.. తెలంగాణలో రాజకీయ పరిణామాలన్నింటినీ హైకమాండ్ అబ్జర్వ్ చేస్తోందని జేపీ నడ్డా పార్టీ నేతలకు వివరించారు. ఏ అంశంలోనూ ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మర్రి శశిధర్ రెడ్డికి బీజేపీ కండువా కప్పి అభినందించారు. అనంతరం పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు, సిట్ నోటీసులు, బీఎల్ సంతోష్ కు నోటీసులపై హైకోర్టు స్టే, ఐటీ రైడ్స్ తదితర అంశాలను నేతలు నడ్డా దృష్టికి తీసుకెళ్లారు.

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర గురించి తెలిపారు. డిసెంబర్ 16న కరీంనగర్ లో జరిగే ఈ యాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. వారి వినతులను పరిగణలోకి తీసుకున్న నడ్డా.. కరీంనగర్ రానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.