AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terror Attack: దేశంలో దాడులకు ఉగ్రవాదులు భారీ ప్లానింగ్‌.. అప్రమత్తమైన భద్రతా దళాలు..

Terror Attack: దేశంలో దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్లాన్‌ వేస్తున్నారా.? ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రిపబ్లిక్‌ డేను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరగనున్నాయా.? అంటే ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి అవుననే..

Terror Attack: దేశంలో దాడులకు ఉగ్రవాదులు భారీ ప్లానింగ్‌.. అప్రమత్తమైన భద్రతా దళాలు..
Narender Vaitla
|

Updated on: Jan 07, 2022 | 6:07 PM

Share

Terror Attack: దేశంలో దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్లాన్‌ వేస్తున్నారా.? ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రిపబ్లిక్‌ డేను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరగనున్నాయా.? అంటే ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు ఉగ్ర దాడులు జరగే అవకాశాలు ఉన్నాయని, దీనికి అనుగుణంగా భ్రదతా దళాలు అప్రమత్తం కావాలని తెలిపారు. పెద్ద స్థాయి నాయకులతో పాటు, సెక్యూరిటీ ఫోర్స్‌ క్యాంప్స్‌పై బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

వీటితో పాటు ఉగ్రవాదులు.. జనాభా ఎక్కువగా ఉన్న ప్రదేశాలైన మార్కెట్లు, రైల్వేస్టేషన్‌లు, బస్‌ స్టాండ్స్‌, మతపరమైన ప్రదేశాలను టార్గెట్ చేసుకున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే భద్రతా దళాలు అలర్ట్‌ కావాలని, ఎయిర్‌పోర్ట్స్‌ లాంటి ప్రదేశాల్లో ఏదైనా దాడులు జరిగితే వెంటనే స్పదించేలా యాక్షన్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పలు కీలక విషయాలు తెలిపారు. ‘భద్రతా దళాలు అలర్ట్‌గా ఉండాలని. ముఖ్యంగా క్యాంప్‌ ఏరియాల్లో ఉండే వారు లోపల, బయట విధుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా క్యాంప్‌ ప్రాంతాలన్నీ నిఘాలో ఉంచాలని సూచించారు. ఆర్మీ క్యాంప్స్‌లో తెలియని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని హెచ్చరించారు. సీసీటీవీ కెమెరాలను నిత్యం పర్యవేక్షించాలని, డాగ్‌ స్క్వాడ్‌లతో పరిసర ప్రాంతాలన్నింటినీ జల్లడపట్టాలని తెలిపారు.

Also Read: CM Jagan: ఏపీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ప్రకటించిన జగన్ సర్కార్.. మరో గుడ్ న్యూస్

Pawan Kalyan: రష్యా నుంచి హైదరాబాద్‌లో లాండ్ అయిన పవన్ కళ్యాణ్ .. న్యూ లుక్‌‌కు ఫ్యాన్స్ ఫిదా..

Pawan Kalyan: రష్యా నుంచి హైదరాబాద్‌లో లాండ్ అయిన పవన్ కళ్యాణ్ .. న్యూ లుక్‌‌కు ఫ్యాన్స్ ఫిదా..