Indira Gandhi: ఇందిరమ్మ వర్ధంతి నేడు.. సొంత సెక్యూరిటీ చేతిలో హతమైన మాజీ ప్రధాని.. చివరి క్షణాల్లో ఏం జరిగిందంటే?

38 సంవత్సరాల క్రితం అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ 1 సఫ్దర్‌జంగ్ ప్రభుత్వ నివాసం నుండి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS హాస్పిటల్) వరకు సాగిన ప్రయాణం.. జరిగిన సంఘటనలు గురించి ఈరోజు తెలుసుకుందాం?

Indira Gandhi: ఇందిరమ్మ వర్ధంతి నేడు.. సొంత సెక్యూరిటీ చేతిలో హతమైన మాజీ ప్రధాని.. చివరి క్షణాల్లో ఏం జరిగిందంటే?
indira gandhi death anniversary
Follow us

|

Updated on: Oct 31, 2022 | 1:03 PM

భారత రాజకీయాల్లో అద్భుతమైన వ్యక్తిత్వం అని ఇందిరా గాంధీని ఇప్పటికీ ప్రశంసిస్తారు. ఇందిరా జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని  చేధించడంలో బిజీగా ఉండేవారు.  నేడు ఇందిరా గాంధీ వర్ధంతిని దేశంమొత్తం జరుపుకుంటుంది. 38 ఏళ్ల అయింది ఇందిరాగాంధీ హత్య చేయబడి. రక్షించాల్సిన బాధ్యత ఉన్నవారే ఈ రోజున ఇందిరా గాంధీని తుపాకీతో కాల్చిచంపారు. ఈరోజు అప్పుడు (అంటే 1984 అక్టోబర్ 31న) ఏమిటి జరిగిందో  తెలుసుకుందాం.

38 సంవత్సరాల క్రితం అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ 1 సఫ్దర్‌జంగ్ ప్రభుత్వ నివాసం నుండి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS హాస్పిటల్) వరకు సాగిన ప్రయాణం.. జరిగిన సంఘటనలు గురించి ఈరోజు తెలుసుకుందాం? ఇందిరా గాంధీ భువనేశ్వర్ (ఒరిస్సా)లో తన చివరి, చిరస్మరణీయ ప్రసంగం తర్వాత అక్టోబర్ 30-31 రాత్రి ఢిల్లీలోని తన అధికారిక నివాసం 1 సదాఫ్‌జంగ్ రోడ్ (అప్పటి ప్రధానమంత్రి నివాసం)కి తిరిగి వచ్చారు. ఆ రాత్రి ఇందిరా పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అందుకే రాత్రిపూట సోనియా మెలకువగా ఉన్నారు. అర్ధరాత్రి సోనియా తనకు మందు కోసం వెతుకుతున్న సమయంలో తన అత్తగారు ఇందిరా గాంధీ కూడా మెలకువగా ఉండడం చూశారు.

సోనియా తో పాటు ఇందిరాగాంధీ కూడా మెడిసిన్స్ వెతకడం మొదలుపెట్టారు. మందు దొరకగానే ఇందిరాగాంధీ సోనియాకు మరేదైనా అవసరం అనిపిస్తే ఎలాంటి సందేహం లేకుండా తన వద్దకు రావాలని చెప్పారు.

ఇంట్లోంచి కుంకుమపువ్వు రంగు చీర కట్టుకుని బయటకు వచ్చిన ఇందిర అక్టోబర్ 31 ఉదయం 7.30 గంటలకు ఇందిరా గాంధీ సిద్ధంగా ఉన్నారు. ఆమె కుంకుమపువ్వు రంగు చీర కట్టుకున్నారు. ఆ రోజు ప్రధాని షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. మొదట ఉస్తినోవ్‌ను కలుసుకోవలసి ఉంది.. అధికారిక నివాసంలో శ్రీమతి గాంధీ ఇంటర్వ్యూను రికార్డ్ చేయాల్సి వచ్చింది. శ్రీమతి గాంధీపై ఓ డాక్యుమెంటరీ తీస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే, బ్రిటీష్ మాజీ ప్రధాని జేమ్స్ కల్లాగన్ , మిజోరాం అధినేతతో ఇందిర సమావేశం కావాల్సి ఉంది. అంతేకాదు 31 అక్టోబర్ 1984 సాయంత్రం.. బ్రిటిష్ యువరాణి ఆన్ తో ఇందిరాగాంధీ విందుకు ఆహ్వానించారు.

ఇందిరా అల్పాహారం తరువాత.. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఉదయం 9.10 గంటలకు ప్రభుత్వ నివాసంలోని లాన్ (ఆహతే / ప్రాంగణంలో) తన గది నుండి బయటకు వచ్చారు. వెంట ప్రైవేట్ సెక్రటరీ ఆర్కే ధావన్, సిపాయి నారాయణ్ సింగ్, రామేశ్వర్ దయాళ్ ఉన్నారు. ఇందిర, RK ధావన్‌తో మాట్లాడుతూ నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఢిల్లీకి చేరుకోమని రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్‌కు సందేశం పంపినట్లు ఆర్కే ధావన్  ఇందిరా గాంధీకి చెప్పారు. రాష్ట్రపతికి సందేశం అందిందని ఆర్కే ధావన్ ధృవీకరించారు.

ఇందిరను కాల్చిన సెక్యూరిటీ గార్డు  రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ ను ప్రధాని ఇందిరా గాంధీ ఢిల్లీకి ఆహ్వానించారు. ఆ సాయంత్రం బ్రిటీష్ యువరాణికి ఇస్తున్న విందులో పాల్గొనాల్సిందిగా కోరారు. ఇండియా హత్యపై స్పానిష్ రచయిత జేవియర్ మోరో సోనియా గాంధీపై రాసిన “ది రెడ్ సారీ” పుస్తకంలో అనేక విషయాలను ప్రస్తావించారు. ‘ఆర్‌కే ధావన్ , ప్రధాని ఇందిరా గాంధీ 1 అక్బర్ రోడ్‌ను కలిపే వికెట్ గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సెక్యూరిటీ గార్డు అప్పటికే సెక్యూరిటీ బియాంట్‌లో ఢిల్లీ పోలీసు ఉద్యోగి నిల్చున్నాడు  బియాంత్ సింగ్సిం ఇందిరా గాంధీని షూట్ చేశాడు. పాయింట్ బ్లాంక్ నుండి రెండు సార్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్  ప్రధాని ఇందిరా గాంధీ ఛాతీలోకి వెళ్ళింది. కాల్పులు జరిగిన వెంటనే ఆమె నేలపై పడిపోయింది.

బియాంత్ సింగ్ కాల్పులు జరిపిన తర్వాతఇందిరా నేలపై పడిపోయిన వెంటనే అక్కడ ఉన్న మరో సెక్యూరిటీ గార్డు సత్వంత్ సింగ్, ఆటోమేటిక్ కార్బైన్‌లో ఉన్న బుల్లెట్లన్నింటినీ ప్రధానమంత్రి శరీరంలో దింపాడు. ఆ బుల్లెట్ల సంఖ్యను కొందరు 25, మరికొందరు 28 అని చెబుతూ ఉంటారు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఇందిరకు తోడుగా ఉన్న రామేశ్వర్ దయాళ్ ఆమె వైపు పరుగెత్తాడు.. దాడి చేసిన వారిలో ఒకరైన సత్వంత్ సింగ్ వెంటనే స్పందించి రామేశ్వర్ దయాళ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

ఇందిరపై కాల్పులు జరిపిన తర్వాత గందరగోళం: ఇందిరాగాంధీ పై కాల్పులు జరిపిన అనంతరం..  1 అక్బర్ రోడ్డులో గందరగోళం నెలకొంది. ఢిల్లీ పోలీసు అధికారి దినేష్ భట్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల శబ్దం విన్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధాని నివాసం వద్ద అంబులెన్స్ లేకపోవడం యాదృచ్ఛికం. అప్పటికే రక్తంతో తడిచి ముద్దైన ఇందిరా గాంధీని అంబాసిడర్ కారులో ఎయిమ్స్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ అంబాసిడర్ కారు ముందు సీట్లో, డ్రైవర్ పక్కన సీటులో ఆర్కే ధావన్ కూర్చున్నారు. కారు ముందుకు కదులుతున్నప్పుడు.. గౌను ధరించిన సోనియా గాంధీ కారు వెనుక చెప్పులు లేకుండా నడుస్తున్నట్లు కనిపించింది. ఆమె వెయిట్-వెయిట్… మమ్మీ-మమ్మీ అని అరుస్తూనే ఉన్నారు.

సోనియా గాంధీ కారు లోపలికి చేరుకోగానే.. రక్తంతో ఉన్న ఇందిరా గాంధీని చూసి కన్నీరు మున్నీరయ్యారు. సృహలో లేని అత్తగారిని పిలుస్తూనే ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి ఎయిమ్స్‌కు వెళ్లే దారిలో సోనియా మళ్లీ మళ్లీ ఇందిరాగాంధీ కళ్లు తెరిచే విధంగా ప్రయత్నం చేశారు.

వీలైనంత త్వరగా కారును ఎయిమ్స్‌కు తీసుకెళ్లాలని సోనియా కారు డ్రైవర్‌కు సూచించారు. ఎయిమ్స్‌కు చేరుకోకముందే సోనియా గాంధీ గౌను పూర్తిగా ఇందిరా గాంధీ రక్తంతో తడిసిపోయింది. సోనియా పదే పదే ఇందిరాగాంధీ ముఖాన్ని తుడుస్తూ, “మమ్మీ దయచేసి మేలుకొని ఉండు.. ఆసుపత్రికి చేరుకుంటున్నాం.. ప్లీజ్ అంటూ సోనియా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ దుర్ఘటన గురించి భర్త రాజీవ్ గాంధీ, పిల్లలకు (ప్రియాంక- రాహుల్) ఎలా తెలియజేయాలని ఆలోచిస్తున్నారు. కారు ఎయిమ్స్‌కు చేరుకుంది. అయితే ప్రధానిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లే సమయంలో ఆస్పత్రి సిబ్బందికి ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో అక్కడ ఎవరూ లేరు.

ఇందిర పరిస్థితి తెలిసి ఎయిమ్స్‌లో కలకలం: ఎయిమ్స్‌లో ప్రధాని ఇందిరా గాంధీపై ఎవరో కాల్చారని..  బుల్లెట్ శరీరంలో దూసుకుని వెళ్లడంతో.. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలియగానే ఒక్కసారిగా ఎయిమ్స్ లో కలకలం రేగింది. హడావుడిగా డాక్టర్ ఎంఎం కపూర్, డాక్టర్ గులేరియా, డాక్టర్ ఎస్.బలరాం కూడా చేరుకున్నారు. ఇందిరాను బతికించడం కోసం 80 సీసాల రక్తాన్ని దానం చేశారు. ఇతర భగీరథ ప్రయత్నాలన్నీ కూడా ప్రధాని ఇందిరాగాంధీని ప్రాణాలు పోయడంలో  విఫలమయ్యాయి. నేటికీ ఇందిరాగాంధీ మరణించి 38 ఏళ్ళు అయింది. భారతీయుల మదిలో ఆమె చిరంజీవిగా నిలిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..