AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydrogen Bus: మొదటిసారి రోడ్లపై పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ బస్.. ఎక్కడో తెలుసా ?

ప్రస్తుతం దేశంలో శిలాజ ఇంధన వనరులను విరివిగా వాడుతున్నాం. ఈ నేపథ్యంలో వీటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తీసుకొచ్చేందుకు ముమ్మురంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు కూడా ఈ ప్రయత్నాలను ప్రారంభించేశాయి. అయితే ఈ క్రమంలోనే ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంతో ప్రోత్సహాన్ని ఇస్తోంది. అలాగే మరోవైపు హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకు కూడా పెద్ద పేట వేస్తోంది.

Hydrogen Bus: మొదటిసారి రోడ్లపై పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ బస్.. ఎక్కడో తెలుసా ?
Hydrogen Bus
Aravind B
|

Updated on: Aug 20, 2023 | 5:15 AM

Share

ప్రస్తుతం దేశంలో శిలాజ ఇంధన వనరులను విరివిగా వాడుతున్నాం. ఈ నేపథ్యంలో వీటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తీసుకొచ్చేందుకు ముమ్మురంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు కూడా ఈ ప్రయత్నాలను ప్రారంభించేశాయి. అయితే ఈ క్రమంలోనే ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంతో ప్రోత్సహాన్ని ఇస్తోంది. అలాగే మరోవైపు హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకు కూడా పెద్ద పేట వేస్తోంది. అయితే ఇందులో భాగంగానే హైడ్రోజన్‌తో నడిచే ఓ బస్సు ట్రయల్స్‌కు సిద్ధమైపోయింది. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉండేటటువంటి శీతల ప్రాంతమైన లద్ధాక్‌లోని రోడ్లపై త్వరలోనే పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. హైడ్రోజన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ అశోక్‌ లేల్యాండ్‌తో కలిసి ఈ బస్సును తయారుచేసింది. అయితే ఒక్కో బస్సు ఖరీదు దాదాపు 2 కోట్ల 50 లక్షలు.

అయితే మొత్తం ఐదు బస్సులను లేహ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు ఎన్టీపీసీ అప్పగిస్తోంది. ఇందులో భాగంగానే మొదటి బస్సు తాజాగా లేహ్‌ చేరుకుంది. ఈ బస్సుల కోసం లేహ్‌లో ఎన్టీపీసీ రీఫిల్లింగ్‌ స్టేషన్‌తో పాటు, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ ఉత్పత్తికి 1.7 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచింది. ఇక త్వరలోనే కమర్షియల్‌ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే మూడు నెలల పాటు ఈ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. సాధారణ బస్సుల లాగే ఈ బస్సులోనూ టికెట్‌ ధరలు వసూలు చేస్తారు. హైడ్రోజన్‌ బస్సుల నడిపే క్రమంలో ఒకవేళ నష్టాలు వాస్తే వాటిని మొత్తం ఎన్టీపీసీనే భరించనుంది. వాస్తవానికి ఆగస్టు 15నే ఈ సేవలు మొదలవ్వాల్సి ఉంది. కానీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వంటి కారణాల వల్ల వీటి కమర్షియల్ ట్రయల్స్ వాయిదా పడ్డాయి.

ఇలాంటి సాంకేతికతో వస్తున్న తొలి హైడ్రోజన్ బస్సు మాత్రమే కాకుండా.. సముద్రమట్టానికి దాదాపు 11,500 అడుగుల ఎత్తులో ఈ బస్సును పరీక్షిస్తుండడం మరో విశేషం. ఇదిలా ఉండగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్‌ కోసం లేహ్ యంత్రాంగం 7.5 ఎకరాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. అరుదైన వాతావరణంలోను.. అలాగే మైనస్ డిగ్రీల్లో, ఉష్ణోగ్రతల్లో కూడా పనిచేసేలా ఈ హైడ్రోజన్ బస్సులను రూపొందించారు. ఇక 2032 సంవత్సరం నాటికి దాదాపు 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా పర్యవరణ రక్షణ కోసం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను దేశంలో అందుబాటులోకి  వచ్చాయి. అయితే ఇప్పుడు హైడ్రోజన్ వాహనాలు కూడా రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ఇక భవిష్యత్తులో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలే రోడ్లపై కనిపించనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..