Accident: లద్దాఖ్‌లో విషాదం.. వాహనం లోయలో పడి 9 మంది సైనికులు మృతి
లద్దాఖ్‌లోని ఖేరి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవాశాత్తు లోయలోకి పడిపోవడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఒకరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఎనిమిది మంది జవాన్లు ఉన్నట్లు అధికాలు తెలిపారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. లేహ్ నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేరీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘట జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

లద్దాఖ్‌లోని ఖేరి సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవాశాత్తు లోయలోకి పడిపోవడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఒకరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఎనిమిది మంది జవాన్లు ఉన్నట్లు అధికాలు తెలిపారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. లేహ్ నుంచి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేరీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘట జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం 4.45 గంటలకు లేహ్ నుంచి నైమా వైపు జవాన్లు బస్సులో ప్రయాణిస్తున్నారు. అయితే ఇంతలోనే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు లోయలోకి వెళ్లి పడిపోయినట్లు లేహ్ సీనియర్ ఎస్పీ పీడీ నిత్యా తెలిపారు. సమాచారం తెలియగానే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారని పేర్కొన్నారు. అనంతరం క్షతగాత్రులైన సైనికులను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఎనిమిదిమంది మృది చెందగా.. ఆ తర్వాత మరో జవాన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడగా అతను చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. లద్దాఖ్‌లో జరిగిన ప్రమాదంలో వీర సైనికులు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఈ విషాద సమయంలో యావత్ భారత దేశం మృతుల కుటుంబాకు అండగా నిలుస్తుందని తెలిపారు. అమరులైన సైనికులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఆ దుర్ఘటనలో గాయపడిన జవాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
మరోవైపు లద్ధాఖ్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం విచారం వ్యక్తం చేశారు. భారతమాత వీరపుత్రులకు వినయపూర్వకంగా నివాళులు అర్పస్తున్నట్లు ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని..అలాగే గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తీరని బాధను తట్టుకునే తట్టుకునే శక్తిని మృతుల కుటుంబ సభ్యులకు అందించాలని భగవంతుడ్ని కోరుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సైనికులు వెళ్తున్న బస్సు లోయలో పడటం పట్ల దేశ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతులకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంతో బస్సులో వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు బాంబు దాడిలో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత చైనా,భారత్ సరిహద్దుల్లో జరిగిన గొడవల్లో సైనికులు ప్రాణాలు కోల్పోవడం కూడా సంచలనం అయ్యింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
