Imran Khan: ఇమ్రాన్ ఖాన్ భార్య సంచలన ఆరోపణలు.. తన భర్తపై విష ప్రయోగం జరగొచ్చని ఆందోళన
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రనా ఖాన్ జైలుకు తరలించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తోషఖానా అనే కేసులో దోషిగా తెలినటువంటి ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న అటక్ అనే జైలులో ఖైదీగా ఉన్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటంపై అతని భార్య బుష్రా బీబీ ఆవేదన వ్యక్తం చేసింది. జైలులో తన భర్త ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని వాపోయింది. ఆయనపై విష ప్రయోగం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది.

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రనా ఖాన్ జైలుకు తరలించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తోషఖానా అనే కేసులో దోషిగా తెలినటువంటి ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న అటక్ అనే జైలులో ఖైదీగా ఉన్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటంపై అతని భార్య బుష్రా బీబీ ఆవేదన వ్యక్తం చేసింది. జైలులో తన భర్త ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని వాపోయింది. ఆయనపై విష ప్రయోగం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. తన భర్త ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన వసతులు ఉన్నటువంటి జైలుకు తరలించాలని డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించి ఆమె పంజాబ్ హోంశాఖ కార్యదర్శికి లేఖను రాశారు. అలాగే ఇమ్రాన్ ఖాన్‌ను అటక్ జైలు నుంచి విడిపించి.. రావల్పిండిలో ఉన్నటువంటి అదియాలాకు తరలించాలని సంబంధిత అధికారులను కూడా కోర్టు ఆదేశించిందని లేఖలో ఆమె గుర్తుకు చేశారు.
అసలు ఎలాంటి సరైన కారణాలు లేకుండానే తన భర్తను అటక్ జైలులోకి తీసుకెళ్లి అక్కడ బంధించారని బుష్రా బీబీ ఆవేదన వ్యక్తం చేసింది. వాస్తవానికి చట్టం ప్రకారం చూసుకుంటే ఆయన్ని అదియాలా జైలుకు తరలించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆయనకు ఉన్న సామాజిక, రాజకీయ హోదాలను దృష్టిలో ఉంచుకోవాలని.. అలాగే ఆయనకు బీ – క్లాస్ సౌకర్యాలు కల్పించాలని కోరింది. గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్‌పై రెండు సార్లు హత్యాయత్నం జరిగిందని తెలిపింది. అయితే అలా హత్యాయత్నానికి ప్రయత్నించిన వారు వారి వెనుక ఉన్నవారిపై ఇంకా చర్యలు తీసుకోలేదని.. ఇప్పటిదాకా కూడా ఎవరిని అరెస్టు చేయలేదని ఆరోపించింది. అయితే తన భర్త ప్రాణాలకు ఇప్పటికీ కూడా ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది బుష్రా బీబీ. అలాగే అటక్ జైలులో ఆయనపై విషప్రయోగం చేసేందుకు ప్రయత్నాలు జరగవచ్చని లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. అలాగే ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు తన భర్తకు అనుమతి ఇవ్వాలని కోరింది.
అలాగే మరో విషయం ఏంటంటే జైలులో ఉన్న నిబంధనల ప్రకారం చూసుకుంటే తన భర్తకు 48 గంటల్లోనే అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందని కూడా ఆమె లేఖలో ఆరోపించారు. కానీ ఇంకా వాటిపై చర్యలు తీసుకోలేదని తెలిపారు. అసలు తన భర్తకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఎందుకు నిరాకరించాల్సి వచ్చింది అనే దానిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జైలులో ఉన్నటువంటి ఇమ్రాన్‌ఖాన్‌ను బుష్రా బీబీ ఇటీవలే కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. దారుణమైన పరిస్థితుల నడుమ తన భర్తను ఉంచారని.. సీ – క్లాస్ జైలు సౌకర్యాలు కల్పించారని విమర్శలు చేశారు. మరోవైపు ఇమ్రాన్‌కు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపై డివిజన్ బెంచ్ ఆగస్టు 22న విచారణ చేపట్టనుంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
