Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 40 మంది ప్రయాణికుల అస్వస్థత

ప్రత్యేక రైలులో వెళ్తున్న ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. భారతీయ రైల్వేలో లభించే ఆహారంపై అనేకసార్లు ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. మరోసారి రైల్వే క్యాంటిన్ నిర్వహకుల నిర్లక్ష్యం బయటపడింది. తాజాగా చెన్నై నుంచి గుజరాత్ వెళ్తున్న ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కావడంతో 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో దాదాపు గంట సేపు రైలును నిలిపివేసి చికిత్స అనంతరం గమ్యస్థానానికి పంపించారు.

Indian Railways: ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 40 మంది ప్రయాణికుల అస్వస్థత
Bharat Gaurav Train
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 29, 2023 | 5:51 PM

ప్రత్యేక రైలులో వెళ్తున్న ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. భారతీయ రైల్వేలో లభించే ఆహారంపై అనేకసార్లు ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి. మరోసారి రైల్వే క్యాంటిన్ నిర్వహకుల నిర్లక్ష్యం బయటపడింది. తాజాగా చెన్నై నుంచి గుజరాత్ వెళ్తున్న ప్రత్యేక రైలులో ఫుడ్ పాయిజన్ కావడంతో 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో దాదాపు గంట సేపు రైలును నిలిపివేసి చికిత్స అనంతరం గమ్యస్థానానికి పంపించారు.

బుధవారం నవంబర్ 29న షోలాపూర్ – పూణే మధ్య ఒక కోచ్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. వికారం, విరేచనాలు, వాంతులు, తలనొప్పితో ఫిర్యాదు చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు. దీంతో పూణే స్టేషన్‌లో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వైద్యుల బృందం ప్రయాణికులందరినీ జాగ్రత్తగా పరిశీలించి, చికిత్స అందించిందని చెప్పారు. దాదాపు 50 నిమిషాల తర్వాత రైలును గమ్యస్థానానికి బయలుదేరింది. ప్రస్తుతం ప్రయాణికులందరి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్‌కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో నవంబర్ 29న రైలును పూణే స్టేషన్‌లో ఆపాల్సి వచ్చిందన్నారు. గుజరాత్‌లోని పాలిటానాలో జరిగే మతపరమైన కార్యక్రమం కోసం భారత్ గౌరవ్ రైలును ప్రత్యేకంగా బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ సంస్థ క్యాటరింగ్ సేవలను నడుపుతోంది. కంపెనీపై మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆహారాన్ని రైల్వే ప్యాసింజర్ గ్రూప్ ప్రైవేట్‌గా కొనుగోలు చేసిందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…